ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: ఎన్నికల అక్రమాలపై ఉద్యమం

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:17 AM

దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు, ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది.

  • దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమం చేపడతాం

  • పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు

  • అదానీ కుంభకోణం, మణిపూర్‌ అల్లర్లు,

  • మత కల్లోలాలపై ఆందోళనల నిర్వహణ

  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలో తీర్మానం

  • కార్యకర్తలు పోరాటం ఆపొద్దు: రాహుల్‌

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు, ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది. ఈవీఎంల దుర్వినియోగం, ఓట్ల లెక్కింపు, ఓటర్ల జాబితా విషయంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవలి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో.. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను సమీక్షించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ మీడియాకు వెల్లడించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు, క్రమశిక్షణను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అఽధ్యక్షుడు ఖర్గే ఈ సమావేశంలో పిలుపునివ్వగా.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కార్యకర్తలు నైతిక స్థైర్యం కోల్పోకూడదని రాహుల్‌ గాంధీ అన్నారు.


రెండు రాష్ట్రాల్లో ఫలితాలు తమకు దిగ్ర్భాంతి కలిగించాయన్న సీడబ్ల్యూసీ.. ఒక పథకం ప్రకారం ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. ఈ ఫలితాలపై సాంకేతిక, రాజకీయ సమీక్షల్ని నిర్వహిస్తున్నామని, త్వరలో మరింత స్పష్టంగా ఈ అక్రమాలను ప్రజల ముందు పెడతామని తెలిపింది. ఫలితాల విశ్లేషణకు అంతర్గత కమిటీలు ఏర్పర్చాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో జిల్లాలవారీగా సమీక్షలు జరిపి పార్టీ పనితీరును బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఖర్గేకు అప్పగించాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఎన్నికల్లో ఓటమికి జవాబుదారీ ఎవరిదో నిర్ణయించి కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది. ‘‘మహాత్మాగాంధీ బెల్గాంలో 1924లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలి. డిసెంబర్‌ 26-27 తేదీల్లో బెల్గాంలో ప్రత్యేక వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. జమ్ముకశ్మీర్‌, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి పార్టీల గెలుపు, వయనాడులో ప్రియాంక ఘనవిజయంపై సీడబ్ల్యూసీ హర్షం వ్యక్తం చేసింది. అదానీ, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలపై చర్చకు ఒప్పుకోకుండా మోదీ సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేసింది.


  • కఠిన చర్యలు తప్పవు: ఖర్గే

వరుస అపజయాలతో కుంగిపోతున్న కాంగ్రె్‌సకు పూర్వవైభవం రావాలంటే.. పార్టీని మూలాల నుంచి బలోపేతం చేయాలంటే.. కఠిన చర్యలు తీసుకోకతప్పదని ఖర్గే అన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలంటే ఓటమికి కారకులైన వారిని జవాబుదారీ చేయాలని, పార్టీలో ఉన్న సంస్థాగత లోపాలను సవరించుకోవాలని ఆయన తన అధ్యక్షోపన్యాసంలో పిలుపునిచ్చారు. ఈవీఏంల పనితీరు కూడా ఎన్నికల ఫలితాలపై అనుమానాలను ఏర్పరుస్తున్నాయని, దేశంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాఽఽధ్యత ఎన్నికల కమిషన్‌ది అని ఆయన చెప్పారు. కార్యకర్తలు, నాయకులు.. అంతా కలిసికట్టుగా పోరాడాలని, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బహిరంగ ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించారు. అది జరగనంత కాలం ప్రత్యర్థులను రాజకీయంగా ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వాతావరణం ఏర్పడినంత మాత్రాన విజయం లభించినట్లు కాదని, ఆ వాతావరణాన్ని ఫలితాలుగా మార్చగలిగిన శక్తిని సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. పాతకాలం పద్ధతులతో పార్టీ విజయాలు సాధించలేదని.. రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని, తగిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.


  • ఢిల్లీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయనుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లోనూ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తామని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్‌ తెలిపారు. ఇండి కూటమిలో భాగంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ హరియాణాలో ఒంటరిగా పోటీ చేయడంతో ఢిల్లీలో కాంగ్రెస్‌ పొత్తుకు దూరంగా ఉంది.


  • ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ నివేదిక!

న్యూఢిల్లీ, నవంబరు 29: మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి పరాభవానికి ఎన్నికల్లో జరిగిన అక్రమాలే కారణమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ఇదేసమయంలో ఎన్నికల సంఘం మాజీ చీఫ్‌ కమిషనర్‌ ఎస్‌.వై. ఖురేషీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రక్రియపై పలు సందేహాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలైన ఓట్లు, ఓట్ల లెక్కింపును ఆయన నిశితంగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ పార్టీ 12 పేజీలతో కూడిన నివేదికను ‘అత్యవసర మెమొరాండం’ పేరుతో శుక్రవారం ఈసీకి సమర్పించింది. తాము లేవనెత్తుతున్న సందేహాలపై విచారణ చేయాలని, ఇన్‌ పర్సన్‌(భౌతికంగా) సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అక్రమాలపై నిగ్గుతేల్చాలని కోరింది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ ఖురేషీ వ్యాఖ్యలను జోడించింది. ఏకపక్షంగా ఓటర్లను తొలగించారని, అదేసమయంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 వేల మంది చొప్పున ఓటర్లను చేర్చారని తెలిపింది. అదేవిధంగా పోలింగ్‌ సమయంలో ప్రకటించిన ఓటింగ్‌ శాతానికి, మరుసటి రోజు ప్రకటించిన ఓటింగ్‌ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంది.

Updated Date - Nov 30 , 2024 | 05:17 AM