ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TVK Party: మా సిద్ధాంతాలనే కాపీ కొట్టారు, విజయ్ పార్టీపై..

ABN, Publish Date - Oct 28 , 2024 | 07:36 PM

టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.

చెన్నై: సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ (Vijay), ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) సిద్ధాంతాలను అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష అన్నాడీఎంకే(AIADMK) కొట్టివేశాయి. తమ సిద్ధాంతాలనే ఆయన కాపీ చేశారని డీఎంకే వ్యాఖ్యానించగా, వివిధ పార్టీల రాజకీయ సైద్ధాంతకీయ అంశాలను 'కాక్‌టైల్' చేశారని అన్నాడీఎంకే అభివర్ణించింది.

రాజకీయాల్లో పిల్లాడినే.. బరిలో భయపడేదే లేదు


తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి వద్ద ఆదివారం సాయంత్రం భారీఎత్తున నిర్వహించిన టీవీకే మహానాడులో తొలిసారి ఆయన కార్యకర్తల సమక్షంలో మాట్లాడారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తాము పాటిస్తామని, లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాల ప్రాతిపదికగా పనిచేస్తామని చెప్పారు. ద్రావిడ భావజాలాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని కుటుంబ సంస్థలా వాడుకుంటున్న వారు తమ శత్రువులని డీఎంకేను టార్గెట్ చేశారు. ద్రావిడ తరహా పాలన పేరుచెప్పి ఓ కుటుంబ పరిపాలన సాగుతోందని, పెరియార్, అన్నాదురై పేర్లు చెప్పుకుని పాలన కొనసాగిస్తున్నారని విజయ్ ధ్వజమెత్తారు.


జైళ్లకు వెళ్లారా, 75 ఏళ్ల జర్నీ మీకుందా?

కాగా, టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు. డీఎంకే సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లో ఎందరో ప్రత్యర్థులను, ఎన్నో పార్టీలను చూసిందన్నారు. ఇది ఆయన మొదటి కాన్ఫెరెన్స్ కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. సైద్ధాంతికత, 75 ఏళ్ల ప్రయాణం సాగించిన పార్టీ డీఏంకే అని, ప్రజాసమస్యలపైనే పార్టీ పోరాడుతూ వచ్చిందని వివరించారు. అయితే ఆ పార్టీ మాత్రం స్థాపించిన రేండేళ్లలోనే 2026లో అధికారంలోకి రావాలని ఆశిస్తోందన్నారు. టీవీకే నేతలు డీఎంకే నేతల్లా ప్రజల కోసం పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లలేదన్నారు. డీఎంకేకూ, ఇతర పార్టీలకు ఉన్న తేడా అదేనని, తాము చాలా పటిష్టంగా ఉన్నామని, ప్రజల కోసమే తాము పనిచేస్తామని, ప్రజల కోసమే తామున్నామని స్పష్టం చేశారు.


ఇంకా చాలా జర్నీ చేయాలి

కాగా, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు అన్నాడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ అభినందనలు తెలుపుతూనే, ఆయన పార్టీ అనుకున్నది సాధించాలంటే చాలా జర్నీ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని పార్టీల సిద్ధాంతాలను కలగలిపిన ఐడియాలజీగా టీవీకే ఐడియాలజీని ఆయన అభివర్ణించారు. కొత్త సీసాలో పాత సారాగా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్‌ మధ్య సీట్ల చిచ్చు!

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 28 , 2024 | 07:36 PM