Share News

CRPF to replace NSG: 9 మంది 'జడ్‌ ప్లస్' కేటగిరి వీఐపీలకు ఎన్ఎస్‌జీ స్థానే సీఆర్‌పీఎఫ్ భద్రత.. ఎవరెవరంటే?

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:50 PM

వీఐపీ సెక్యూరిటీ విధుల నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ కమండో ఫోర్స్ ఎన్ఎస్‌జీని దశలవారిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఎస్‌జీ స్థానే ఆ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్‌ కు అప్పగించనుంది.

CRPF to replace NSG: 9 మంది 'జడ్‌ ప్లస్' కేటగిరి వీఐపీలకు ఎన్ఎస్‌జీ స్థానే సీఆర్‌పీఎఫ్ భద్రత.. ఎవరెవరంటే?

న్యూఢిల్లీ: వీఐపీ (VIP) సెక్యూరిటీ విధుల నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ కమండో ఫోర్స్ ఎన్ఎస్‌జీ (NSG)ని దశలవారిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఎస్‌జీ స్థానే ఆ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్‌ (CRPF)కు అప్పగించనుంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. కేంద్రం నిర్ణయంతో తొమ్మిది మంది "జడ్-ప్లస్'' కేటగిరి వీఐపీలకు ఇస్తున్న ఎన్ఎస్‌జీ భద్రతను ఇక నుంచి సీఆర్‌పీఎఫ్ చేపడుతుంది.

Omar Abdullah: ప్రజలను లాఠీలతో బెదిరించొద్దు...సీఎం తొలి ఆదేశం


'జడ్ ప్లస్' కేటగిరిలోని 9 మంది ప్రముఖులు వీరే...

ఎన్‌ఎస్‌జీకి చెందిన 'బ్లాక్ క్యాట్' కమెండోలతో 'జడ్ ప్లస్' కేటగిరి భద్రతలో ఉన్న తొమ్మిది మందిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అడ్వాణి, కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఉన్నారు. వీరికి ప్రస్తుతం ఎన్ఎస్‌జీ భద్రత ఉండగా, ఆస్థానే సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించనున్నారు.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి..

Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..

DA Hike: మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

Updated Date - Oct 16 , 2024 | 08:09 PM