ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DCM: ఈవీఎంల వల్లే ఆ రెండుపార్టీలకు ఎక్కువ స్థానాలు వచ్చాయి..

ABN, Publish Date - Jun 19 , 2024 | 12:36 PM

ఈవీఎంల కారణంగానే జేడీఎస్‌, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు: ఈవీఎంల కారణంగానే జేడీఎస్‌, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీబీఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ రావాలని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున ఏమి చేయడం సాధ్యం కాదన్నారు. మరోసారి ఫలితాలను పరిశీలించవచ్చు అన్నారు. మధ్యప్రదేశ్‌లో బ్యాలెట్‌ ఓటింగ్‌ ఉన్నప్పుడు మూడింట రెండొంతులు కాంగ్రె్‌సకు వచ్చేవని, ఈవీఎంల కారణంగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అన్నారు. వీటిపై సమగ్ర పరిశోధన జరపాల్సి ఉందన్నారు. బీబీఎంపీ ఆస్తులను తాకట్టుపెట్టే విషయమై మీడియా ప్రశ్నకు సమాధానంగా బీబీఎంపీ ఆస్తుల రక్షణ సమీక్ష జరుపుతామన్నారు. కాంట్రాక్టుకు ఇచ్చిన అనుమతులను రెన్యూవల్‌ చేస్తామన్నారు. బీబీఎంపీ(BBMP)లో ప్రకటనల నిబంధనలు వారం రోజుల్లో తీసుకొస్తామన్నారు.


మెట్రో పిల్లర్లు, భారీ హోర్డింగ్‌ల వద్ద ప్రకటనలతో ఇబ్బంది ఏర్పడితే తొలగిస్తామన్నారు. అంచెలంచెలుగా ఫ్లెక్సీలను నిషేధిస్తామన్నారు. భారీ హోర్డింగ్‌లతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లండన్‌ తరహాలో ఎన్నికలు జరిపే అంశం ప్రస్తావనలో లేదన్నారు. నటుడు దర్శన్‌ నివాసం రాజకాలువపై ఉందనే అంశాన్ని మీడియా ప్రశ్నించగా దర్శన్‌తోపాటు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. బెంగళూరు పరిసర ప్రాంతాలలో 20వేల ఎకరాల భూమి విక్రయానికి సిద్ధంగా ఉందనే అంశం అవాస్తవమన్నారు. కర్ణాటక ప్రభుత్వం నీట్‌ పరీక్షలకు వ్యతిరేకమని, అన్యాయానికి గురైన 1563 మంది విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరపకుండా దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షలు జరపాలని డిమాండ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 12:36 PM

Advertising
Advertising