Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

ABN, Publish Date - Aug 18 , 2024 | 05:52 AM

కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నియమించారు.

Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నియమించారు. ఈ మేరకు శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా అభిషేక్‌ సింఘ్వీని కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అక్కడ ఆ పార్టీ వార్‌రూం చైర్మన్‌గా చల్లా వంశీచంద్‌రెడ్డిని నియమించారు.

Updated Date - Aug 18 , 2024 | 05:52 AM

Advertising
Advertising
<