Delhi CM Atishi: ముఖ్యమంత్రి అతిషికి జడ్ కేటగిరి భద్రత
ABN, Publish Date - Sep 25 , 2024 | 08:55 PM
ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రికి 'జడ్' కేటగిరి భద్రత వర్తిస్తుంది. జడ్ కేటగిరి భద్రత కింద షిప్టుల వారిగా ఢిల్లీ పోలీసులు 22 మందిని మోహరించారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అతిషి (Atishi)కి ఢిల్లీ పోలీసులు 'జడ్' కేటగిరి భద్రత (Z category secturity) కల్పించినట్టు అధికార వర్గాలు బుధవారంనాడు తెలిపారు. గత శనివారం నుంచి అతిషి కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు భద్రతను కల్పించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రికి 'జడ్' కేటగిరి భద్రత వర్తిస్తుంది. జడ్ కేటగిరి భద్రత కింద షిప్టుల వారిగా ఢిల్లీ పోలీసులు 22 మందిని మోహరించారు. ఈ భద్రతా కేటరిగి కింద పీఎస్ఓలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. అయితే ముఖ్యమంత్రికి ఉన్న ముప్పు అంచనాలను హోం శాఖ ఆదేశాలతో సెంట్రల్ ఏజెన్సీలు సమీక్షించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
MCD Meet: ఆప్‌కు కౌన్సిలర్లు షాక్.. కీలకమైన ఎంసీడీ మీట్‌కు ముందు బీజేపీలోకి జంప్
కార్మికుల కనీస వేతనాలపై సీఎం కీలక నిర్ణయం
కాగా, అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ అతిషి బుధవారంనాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనంగా రూ.18,066, మధ్యస్తంగా నైపుణ్య కలిగిన వారికి రూ.19,929, నైపుణ్యం కలిగిన వారికి రూ.21,917 పెంచుతూ ఆప్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు చెపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా కనీస వేతనాలు ఇస్తున్న క్రెడిట్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసంఘటిత రంగ కార్మికులకు ఢిల్లీలో కంటే అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు.
Read More National News and Latest Telugu News
Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
Updated Date - Sep 25 , 2024 | 08:55 PM