Arvind Kejriwal: మరో 7 రోజులు బెయిల్ పొడిగించండి
ABN, Publish Date - May 27 , 2024 | 09:58 AM
లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన తర్వాత బరువు 7 కిలోలు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే తాను పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో టెస్టులు చేయించుకోవడానికి మరో 7 రోజులు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు.
ఎప్పుడు లొంగిపోవాలి?
నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై(interim bail) బయట ఉన్నారు. సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ(ED) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.
దాదాపు 51 రోజుల తర్వాత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జైలు నుంచి బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు అయనకు 21 రోజులు మాత్రమే రిలీఫ్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22కి సంబంధించిన లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ జరిగిందని ఈ కేసులో ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి:
Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
Kaviya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్
Read Latest National News and Telugu News
Updated Date - May 27 , 2024 | 11:32 AM