ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : రైతులకు వినేశ్‌ మద్దతు

ABN, Publish Date - Sep 01 , 2024 | 03:50 AM

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మద్దతు పలికారు.

  • శంభూ సరిహద్దు వద్ద అన్నదాతలకు సంఘీభావం

  • మద్దతు ధరపై 200వ రోజుకు చేరిన ఆందోళన

  • కేంద్ర ప్రభుత్వ తీరు బాధాకరమని వినేశ్‌ విమర్శ

  • రాజకీయ ప్రవేశంపై సమాధానం దాటవేత

  • రెజ్లర్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నం!

న్యూఢిల్లీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మద్దతు పలికారు. శనివారం వారి నిరసనలు 200కు రోజుకు చేరిన సందర్భంగా వెళ్లిన వినేశ్‌.. సంఘీభావం ప్రకటించారు. ‘రైతు కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. మీ కోసం ఎవరూ రారు. హక్కుల కోసం మీరే పోరాడాలి. డిమాండ్లు సాధించేదాకా వెనుదిరగొద్దు. నేను మీ బిడ్డను. మీ వెంటే ఉంటా’ అని భరోసా ఇచ్చారు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాంగ్రె్‌సలో చేరుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. వ్యతిరేకంగా స్పందించలేదు. ‘‘ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడితే రైతుల ఆందోళనకు ప్రాఽధాన్యం తగ్గిపోతుంది. మీ దృష్టి నాపై కాదు. అన్నదాతల ఆందోళనపైకి మళ్లించండి’’ అని మీడియాను అభ్యర్థించారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్‌ పతకం కోల్పోయారు. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి వినేశ్‌ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒలింపిక్స్‌ తర్వాత వినేశ్‌ ఫొగట్‌ ఫాలోయింగ్‌ మరింత పెరిగింది. క్రీడలకు బాగా ప్రాధాన్యమిచ్చే హరియాణాలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వినేశ్‌ రాజకీయాల్లోకి వస్తే కీలక పాత్ర పోషిస్తారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆమె పార్టీలో చేరతారా, లేక స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉపయోగపడతారా అన్న చర్చ జరుగుతోందని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. గతేడాది బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు నిర్వహించిన నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌, ప్రియాంక సంఘీభావం ప్రకటించారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రాహుల్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. కాగా, హరియాణాలో తమకు సానుకూల పవనాలు ఉన్నాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

Updated Date - Sep 01 , 2024 | 03:53 AM

Advertising
Advertising