ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: యూపీఎస్సీ అభ్యర్థిని బాత్ రూమ్‌లో సీసీ కెమెరాలు.. ఢిల్లీలో సంచలనం రేపుతున్న ఘటన..

ABN, Publish Date - Sep 24 , 2024 | 07:47 PM

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువతి యూపీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. కోచింగ్ నిమిత్తం ఢిల్లీ షకర్‌పూర్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా అద్దెకు ఉంటోంది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లోని పైఅంతస్తులో ఇంటి యజమాని కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

ఢిల్లీ: యూపీఎస్సీ మహిళా అభ్యర్థిని అపార్ట్‌మెంట్‌ బాత్ రూమ్, బెడ్ రూమ్‌లో సీసీ కెమెరాలు అమర్చిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. యువతి ఇంట్లో లేని సమయంలో తాళాలు తీసి లోపలికి ప్రవేశించిన యువకుడు కెమెరాలు అమర్చాడు. సీసీ కెమెరాల విషయాన్ని పసిగట్టిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఇంటి యజమాని కుమారుడే నిందితుడిగా గుర్తించారు. అనంతరం అతణ్ని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ ఘటన రాజధాని నగరాన్ని కుదిపేస్తోంది.


ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువతి యూపీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. కోచింగ్ నిమిత్తం ఢిల్లీ షకర్‌పూర్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా అద్దెకు ఉంటోంది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లోని పైఅంతస్తులో ఇంటి యజమాని కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇటీవల ఆమె వ్యక్తిగత కారణాల నిమిత్తం స్వగ్రామం వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఢిల్లీకి వచ్చింది. అయితే ఊరు వెళ్లే ముందు తన రూమ్ తాళాలను ఇంటి యజమాని కుమారుడు కరణ్(30)కు ఇచ్చింది. యువతి వచ్చిన రెండు, మూడ్రోజుల తర్వాత తన ల్యాప్ ట్యాప్‌కు వేరే డివైజ్ కనెక్ట్ అయినట్లు ఆమె గుర్తించింది. తన వాట్సాప్‌లో అసాధారణ కార్యకలాపాలు జరిగినట్లు ఆమెకు అర్థమైంది. వెంటనే వేరే డివైజ్‌ను లాగ్ ఔట్ చేసింది. అయితే తన ల్యాప్ ట్యాప్‌కు వేరేవారు కనెక్ట్ అవ్వడంపై యువతికి అనుమానం వచ్చింది.


తాను లేని సమయంలో ఎవరో వచ్చినట్లు, తనపై ఎవరో నిఘా పెట్టినట్లు యువతి అనుమానించింది. వెంటనే గది మెుత్తం వెతకడం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా తన బాత్ రూమ్‌లోని బల్బ్ ఓలర్‌లో సీసీ కెమెరాను గుర్తించింది. దీంతో వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు సీనియర్ పోలీసు అధికారిణి అపూర్వ గుప్తా, సిబ్బంది అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇదే క్రమంలో తనిఖీలు చేయగా బెట్ రూమ్‌లోని బల్బ్‌లో మరో సీసీ కెమెరాను గుర్తించారు. అయితే ఇటీవల తను స్వగ్రామానికి వెళ్లిన సమయంలో తాళాలను కరణ్‌కు ఇచ్చినట్లు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో ఢిల్లీ పోలీసులు తమ స్టైల్లో విచారణ చేపట్టారు.


ఇంటి యజమాని కుమారుడు కరణే సీసీ కెమెరాలు అమర్చినట్లు విచారణలో వెల్లడైందని పోలీసు అధికారిణి అపూర్వగుప్తా వెల్లడించారు. యువతి ఊరు వెళ్లే సమయంలో మెయిన్‌టనెన్స్ పేరుతో తాళాలు తీసుకున్నాడని ఆమె తెలిపారు. అనంతరం మార్కెట్‌లో దొరికే మూడు సాధారణ సీసీ కెమెరాలు కొనుగోలు చేసి యువతి బెడ్ రూమ్, బాత్ రూమ్‌లో ఒక్కొక్కటి చొప్పున అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే వాటిని ఆన్ లైన్ ద్వారా యాక్సెస్ చేసే అవకాశం లేకపోవడంతో ఏదో ఓ కారణం చెప్పి ఆమె వద్ద తాళాలు తీసుకునే ప్రయత్నం చేసేవాడని అధికారిణి చెప్పారు. ఆ విధంగా రికార్డు చేసిన దృశ్యాలను ఆమె ల్యాప్ టాప్ సహాయంతో మెమెురీ కార్డుకు బదిలీ చేసుకునేవాడని ఆమె తెలిపారు. దీంతో నిందితుణ్ని కరణ్‌ను అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించినట్లు అపూర్త గుప్తా తెలిపారు.

Updated Date - Sep 24 , 2024 | 07:47 PM