ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు..

ABN, Publish Date - May 07 , 2024 | 02:53 PM

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు దఫాలుగా కోర్టుకు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీని పొడగిస్తూ వస్తోంది కోర్టు. తాజాగా ఇవాళ్టితో కస్టడీ ముగియగా..

CM Aravind Kejriwal

న్యూఢిల్లీ, మే 07: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు(CM Aravind Kejriwal) కస్టడీని మరోసారి పొడగించింది కోర్టు. మంగళవారంతో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మే 20వ తేదీ వరకు కస్టడీని పొడగించింది. దీంతో కేజ్రీవాల్ మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.


లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు దఫాలుగా కోర్టుకు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీని పొడగిస్తూ వస్తోంది కోర్టు. తాజాగా ఇవాళ్టితో కస్టడీ ముగియగా.. ధర్మాసనం మరోసారి కేజ్రీవాల్‌కు కస్టడీని పొడగించింది.


కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్..

ఇదిలాఉంటే.. తనను ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం.. కేజ్రీవాల్‌కి కీలక సూచనలు చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. బెయిల్‌పై విడుదలయ్యాక ఫైళ్లపై సంతకాలు కూడా చేయొద్దని సూచించింది. అయితే లిక్కర్ స్కాం కేసుపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి. లంచ్ బ్రేక్ తరువాత కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది.

For More Nationa News and Telugu News..

Updated Date - May 07 , 2024 | 02:53 PM

Advertising
Advertising