ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: గంగ తరహాలోనే కావేరి హారతి...

ABN, Publish Date - Jul 23 , 2024 | 12:58 PM

వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్‌ఎస్‌ జలాశయాన్ని డీకే సందర్శించారు.

- రాష్ట్రం నుంచి వారాణసికి కమిటీ

- క్షేత్ర పవిత్రతను కాపాడుతాం..

- డీసీఎం డీకే శివకుమార్‌

- కేఆర్‌ఎస్ సందర్శన

బెంగళూరు: వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్‌ఎస్‌ జలాశయాన్ని డీకే సందర్శించారు. కేఆర్‌ఎస్‏లో నీటిమట్టంతోపాటు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. తమిళనాడుకు నీటి విడుదలకు సంబంధించి కూడా వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండ్య, కొడగు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి వారణాశిలో జరిగే గంగాహారతి కార్యక్రమంపై అధ్యయనం చేసి రావాలని సూచించామన్నారు. నెలరోజుల్లో నివేదిక కోరామన్నారు. అదే విధంగా కావేరి హారతిని, కావేరి వాటర్‌ బోర్డు, దేవదాయశాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తామన్నారు. కేఆర్‌ఎస్‌ జలాశయం పవిత్ర క్షేత్రమన్నారు. ఇక్కడ కావేరి హారతి నిర్వహిస్తే పర్యాటకులను ఉత్తేజ పరిచినట్లు అవుతుందన్నారు.

ఇదికూడా చదవండి: Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర డ్యాం..


ముఖ్యమంత్రి(Chief Minister)తో చర్చించి శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం వాయనం సమర్పిస్తామన్నారు. వరుణుడి కృపతో కావేరితీరంలో సంతృప్తికరంగా వర్షాలు కురిశాయన్నారు. కేఆర్‌ఎస్‌ జలాశయం నిండిందన్నారు. కావేరి నీటి నిర్వహణా మండలి ఈనెల 12నుంచి 31వరకు 20 టీఎంసీలను విడుదల చేయాలని సూచించిందన్నారు. ఇప్పటివరకు తమిళనాడుకు కేఆర్‌ఎస్‌, కబిని, హారంగి, హేమావతిలనుంచి 30 టీఎంసీల నీరు విడుదల చేశామని వారి కోటా 40 టీఎంసీలలో మరో 10 మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 1657 చెరువులకు నీరు మళ్లించేలా అధికారులకు సూచించామన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు కొరత లేకుండా పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి, ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టణ్ణయ్య పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 12:58 PM

Advertising
Advertising
<