Maharashtra polls: సీఎం ఎవరో సంకేతాలిచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్
ABN, Publish Date - Oct 16 , 2024 | 06:28 PM
అధికార మహాయుతి ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు రావాలంటూ ఎంవీఏ సవాలు విసిరిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారి స్పందించారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి (Mayayuti), ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) మధ్య సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. అధికార మహాయుతి ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు రావాలంటూ ఎంవీఏ సవాలు విసిరిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తొలిసారి స్పందించారు. ఏక్‌నాథ్ షిండేనే మహాయుతి సీఎం అభ్యర్థి అంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమ ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నందున సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం మహాయుతి సర్కార్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఫడ్నవిస్ బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Rail-Road Bridge: వారణాసిలో రూ.2,642 కోట్లతో రైల్-రోడ్ బ్రిడ్జి.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
''సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన పని మాకు లేదు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు. మరి మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని పవార్ సాహెబ్ (శరద్ పవార్)ను నేను సవాల్ చేస్తు్న్నాను'' అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్నికల తర్వాత ఎలాగూ అధికారంలోకి రామని తెలిసే సీఎం అభ్యర్థిని ఎంవీఏ ప్రకటించడం లేదన్నారు
పవార్ ఏమన్నారు?
సీఎం అభ్యర్థి విషయంలో శరద్ పవార్ గత నెలలో స్పష్టతనిస్తూ, ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఎంవీఏకు లేదని, సమష్టి నాయకత్వం కింద తమ కూటమి పోటీ చేస్తుందని చెప్పారు. సభ్యులను (గెలిచిన సీట్ల సంఖ్యను) బట్టే నాయకత్వ పగ్గాలు చేపట్టేదెవరనే నిర్ణయం ఉంటుందని, ఎన్నికలకు ముందు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 20న జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి..
Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..
DA Hike: మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
Updated Date - Oct 16 , 2024 | 06:28 PM