ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devendra Fadnavis: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్

ABN, Publish Date - Jun 08 , 2024 | 08:14 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

Devendra Fadnavis Takes U Turn On Resignation

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు. తాను పారిపోయే ప్రసక్తే లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. అమిత్ షాతో (Amit Shah) బేటీ అయిన ఒక రోజు తర్వాత ఫడ్నవిస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేయాలని అమిత్ షా కోరడంతో.. రాజీనామా చేయకూడదని ఫడ్నవిస్ డిసైడ్ అయ్యారు.


Read Also: నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?

‘‘ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ పేరు మార్మోగిపోతోంది. ప్రధానమంత్రిగా మోదీ పేరుని ఎన్డీఏ కూటమి ఇప్పటికే అంగీకరించింది. ఈసారి మహారాష్ట్రలో మేము కోరుకున్న సీట్లు పొందలేకపోయాం కానీ.. మా భవిష్యత్తు వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్నాం’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తానే నాయకత్వం వహించాను కాబట్టి.. ఈ ఓటమికి తానే బాధ్యత వహించానని అన్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేసి.. అసెంబ్లీ ఎన్నికల కోసం అట్టడుగు స్థాయిలో పని చేయొచ్చని అనుకున్నానని చెప్పారు. అయితే.. అగ్రనాయకత్వం తనపై నమ్మకం ఉంచిందన్నారు. తాను నిరాశలో ఉన్నానని కొందరు భావిస్తున్నారని.. కానీ తాను పారిపోయేవాడ్ని కానని తెగేసి చెప్పారు. తన స్పూర్తి ఛత్రపతి శివాజీ అని.. తానెలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదని.. తనకో వ్యూహం ఉందని చెప్పుకొచ్చారు.


Read Also: మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

ఇదిలావుండగా.. నరేంద్ర మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర లభించిన తర్వాత శుక్రవారం ఫడ్నవిస్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంగా కొనసాగాలని, మహారాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అక్టోబర్‌లో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించాలని చెప్పారు. ఈ భేటీ గురించి ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అమిత్ షా తనతో కలిశారన్నారు. ఇకపై ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోకుండా పని చేస్తానని పేర్కొన్నారు. తనపై ఆయన కూడా అదే నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడు.

Read Latest National News and Telugu News

Read more!

Updated Date - Jun 08 , 2024 | 08:14 PM

Advertising
Advertising