EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు
ABN, Publish Date - Nov 04 , 2024 | 03:50 PM
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ECI) సోమవారంనాడు కీలక ప్రకటన చేసింది. మూడు రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల తేదీని నవంబర్ 13 నుంచి నవంబర్ 20వ తేదీకి మార్చింది. ఉప ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగిన రాష్ట్రాల్లో కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
PM Modi: జార్ఖాండ్ అభివృద్ధికి గుదిబండ జేఎంఎం
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 20వ తేదీకి మార్చినట్టు ప్రకటించింది.
పోలింగ్ తేదీ మారిన నియోజకవర్గాలివే
నవంబర్ 13 నుంచి 20వ తేదీకి మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేరళలోని పాలక్కాడ్, పంజాబ్‌లోని డేరా బాబా నానక్, చబ్బేవాల్, గిద్దఢ్‌బాహా, బర్నాలా, ఉత్తరప్రదేశ్‌లోని మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ (ఎస్‌సీ), కర్హాల్, సిసమౌ, ఫూల్‌పుర్, కతెహారి, మఝవా ఉన్నాయి.
కాగా, తాజా మార్పులతో 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, జార్ఖాండ్ రెండో విడత ఎన్నికలతో కలిసి జరుగనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 30న జరుగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
ఇది కూడా చదవండి..
Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 04 , 2024 | 03:50 PM