ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anna Hazare: కేజ్రీవాల్‌‌పై అరెస్టుపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 22 , 2024 | 01:37 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం రాత్రి అరెస్టు చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్టును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి ఆప్ నేతలు, కార్యకర్తలు నిరంతరం నిరసనలు చేస్తున్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్టును ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించాయి. అయినప్పటికీ, వీటన్నింటి మధ్య ఒకప్పుడు కేజ్రీవాల్‌పై గుర్రుగా ఉన్న అన్నా హజారే(Anna Hazare) తాజాగా ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ విషయంపై ఆయన ఏం మాట్లాడారో ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare) తనదైన శైలిలో స్పందించారు. గతంలో తనతో కలిసి లిక్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అరెస్ట్ కావడం బాధగా ఉందన్నారు. తన సొంత పనుల కోసమే లిక్కర్ పాలసీలు చేశారు కాబట్టే ఈడీ(ED) అరెస్ట్ చేసిందని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు.


కేజ్రీవాల్ నా మాట వినలేదని, సిసోడియా నాతో ఉన్నపుడు ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పానని అన్నా హజారే వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ విషయమై కేజ్రీవాల్‌కు రెండు సార్లు లేఖలు రాశానని గుర్తు చేశారు. కానీ ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు అతనికి ఎలాంటి సలహా ఇవ్వలేనని సామాజిక వేత్త అన్నా హజారే స్పష్టం చేశారు. చట్టం తనపని తాను చేస్తుందని, కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని మహారాష్ట్ర(Maharashtra)లోని అహ్మద్‌నగర్‌(Ahmednagar)లో మాట్లాడిన క్రమంలో పేర్కొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AAP Ministers Detained: పోలీసుల అదుపులో ఢిల్లీ ఆప్ మంత్రులు.. కాంగ్రెస్ రియాక్ట్

Updated Date - Mar 22 , 2024 | 01:38 PM

Advertising
Advertising