ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 09:36 AM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

కోల్‌కతా, సెప్టెంబర్ 17: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్‌‌ను సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. అలాంటి వేళ ఉత్తర కోల్‌కోతలోని ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు.

Also Read: New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్


అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో సైతం తనిఖీలు..

అలాగే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదీప్తి రాయ్ నర్సింగ్ హోమ్‌పై సైతం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ రెండు ప్రదేశాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టాయి. శ్రీరామ్‌పుర్ ఎమ్మెల్యే సుదీప్తి రాయ్.. పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పేషెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ చైర్మన్‌గా సైతం సుదీప్తి రాయ్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో రాయ్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


ఇప్పటికే ప్రొ. ఘోష్ నివాసంతోపాటు పలు చోట్ల ఈడీ సోదాలు..

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ నివాసంతోపాటు ఆ ఆసుపత్రికి వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థతోపాటు ముందులు విక్రయించిన సంస్థలపై ఇప్పటికే ఈడీ దాడులు నిర్వహించిన విషయం విధితమే.


హత్యాచారం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా..

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కొన్ని గంటలకే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేస్తున్నట్లు తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మృతురాలు తన కుమార్తె వంటిందని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదన్నారు.


అయితే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన ప్రొ. సందీప్ ఘోష్‌ను ఆ వెంటనే మరో కాలేజీ ప్రిన్సిపాల్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని కోల్‌కతా హైకోర్టు తప్పు పట్టింది. ప్రొ. ఘోష్‌ని సెలవుపై పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


మరోవైపు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొ. ఘోష్ హయాంలో భారీగా ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆరోపణలు గుప్పించారు. దీంతో ప్రొ. ఘోష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.


ఇంకోవైపు హత్యాచార బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దాదాపు నెలకుపైగా ఆందోళన చేపట్టారు. సోమవారం సాయంత్రం సీఎం మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. ఈ చర్చలు దాదాపుగా ఫలప్రదమైన సంగతి తెలిసిందే.

For More National News and Telugu News

Updated Date - Sep 17 , 2024 | 09:36 AM

Advertising
Advertising