ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

ABN, Publish Date - Oct 07 , 2024 | 03:48 AM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది.

  • భారీ చిట్‌ఫండ్‌ కుంభకోణంలో దర్యాప్తు

న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఇందులో తెలంగాణతో పాటు ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. పెరల్స్‌ ఆగ్రోటెక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(పీఏసీఎల్‌)కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది.

తనిఖీల్లో భాగంగా పలువురి నుంచి నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ‘ఎక్స్‌’లో వెల్లడించింది. కాగా, దాదాపు 5 కోట్ల మంది నుంచి సుమారు రూ. 50 వేల కోట్లు వసూలు చేసిన పీఏసీఎల్‌... వారికి డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసింది. గత కొన్నేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. పెరల్స్‌ గ్రూపు వ్యవస్థాపకుడు నిర్మల్‌సింగ్‌ ఇటీవల తిహాడ్‌ జైలులో కన్నుమూశారు.

Updated Date - Oct 07 , 2024 | 03:48 AM