ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Enforcement Directorate : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.400 కోట్ల మోసం

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:26 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ యాప్‌ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ యాప్‌ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది. చైనాకు చెందిన ‘ఫీవిన్‌’ యాప్‌తో వారికి సంబంధం ఉందని పేర్కొంది.

ఒడిశాలోని రౌర్కెలాకు చందిన అరుణ్‌ సాహు, అలోక్‌ సాహు, పట్నాకు చెందిన సివిల్‌ ఇంజినీరు చేతన్‌ ప్రకాశ్‌, చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు జోసెఫ్‌ స్టాలిన్‌లను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్టు చేసింది.

అరుణ్‌ సాహు, అలోక్‌ సాహులు యాప్‌ ద్వారా తమ బ్యాంకు ఖాతాలో జమైన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చారు. దానిని ఫారిన్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ అయిన బియాన్స్‌ ద్వారా చైనా జాతీయుల ఖాతాలకు అక్రమంగా మళ్లించారు.

మరోవైపు, పోంజీ స్కీం నడిపి జనాలను మోసగించిన పెరల్‌వైన్‌.కామ్‌ అనే పోర్టల్‌కు చెందిన రూ.29.25 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది.

Updated Date - Aug 17 , 2024 | 03:29 AM

Advertising
Advertising
<