Exit Polls: ఎక్జిట్ పోల్స్ నిజమౌతాయా? 2014, 2019లో ఏమైంది?
ABN, Publish Date - Jun 01 , 2024 | 07:41 PM
ఉత్కంఠభరిత వాతావరణం నడుమ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఓటర్ల మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఢిల్లీ: ఉత్కంఠభరిత వాతావరణం నడుమ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఓటర్ల మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వాస్తవ ఫలితాలను భారత ఎన్నికల సంఘం జూన్ 4న ప్రకటిస్తుంది.
ఈలోపే ఎగ్జిట్ పోల్స్ రూపంలో శనివారం పలు సంస్థలు పార్టీల జాతకాలు బయటపెట్టాయి. మరి ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పే విషయాలన్ని నిజమవుతాయా? ఆయా సంస్థలకున్న విశ్వసనీయత ఎంత? 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలు నిజమయ్యాయా? తెలుసుకుందాం..
2014 ఎగ్జిట్ పోల్స్ vs వాస్తవ ఫలితాలు
2014లో చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ముందే ఊహించాయి. కానీ సర్వే సంస్థలు ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీతో బీజేపీ సర్కార్ అధికారం చేపట్టింది.
ఎన్డీయేపై వివిధ సర్వే సంస్థల అంచనాలు
1. ఇండియా టుడే-సిసెరో: ఎన్డీఏకి 272 సీట్లు వస్తాయని అంచనా వేసింది
2. న్యూస్ 24-చాణక్య: 340 సీట్లు
3. CNN-IBN-CSDS: 280 సీట్లు
4. టైమ్స్ నౌ ORG: 249 సీట్లు
5. ABP న్యూస్-నీల్సన్: 274 సీట్లు
6. NDTV-హంస రీసెర్చ్: 279 సీట్లు
యూపీఏపై అంచనాలు...
1. ఇండియా టుడే-సిసిరో: యూపీఏకు 115 సీట్లు వస్తాయని అంచనా వేసింది
2. న్యూస్ 24-చాణక్య: 101 సీట్లు
3. CNN-IBN-CSDS: 97 సీట్లు
4. టైమ్స్ నౌ ORG: 148 సీట్లు
5. ABP న్యూస్-నీల్సన్: 97 సీట్లు
6. NDTV-హంస రీసెర్చ్: 103 సీట్లు
వాస్తవ ఫలితాలు
2014 ఎన్నికల్లో NDA 336 సీట్లు సాధించగా.. బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో UPA 60 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
2019 ఎగ్జిట్ పోల్స్ vs వాస్తవ ఫలితాలు
ఎన్డీయేపై అంచనాలు
1. ఇండియా టుడే-యాక్సిస్: 339-365 సీట్లు
2. న్యూస్ 24-టుడేస్ చాణక్య: 350 సీట్లు
3. News18-IPSOS: 336 సీట్లు
4. టైమ్స్ నౌ VMR: 306 సీట్లు
5. ఇండియా TV-CNX: 300 సీట్లు
6. సుదర్శన్ న్యూస్: 305 సీట్లు
యూపీఏపై అంచనాలు
1. ఇండియా టుడే-యాక్సిస్: 77-108 సీట్లు
2. న్యూస్ 24-టుడేస్ చాణక్య: 95 సీట్లు
3. News18-IPSOS: 82 సీట్లు
4. టైమ్స్ నౌ VMR: 132 సీట్లు
5. ఇండియా TV-CNX: 120 సీట్లు
6. సుదర్శన్ న్యూస్: 124 సీట్లు
వాస్తవ ఫలితాలు
NDA 352 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది. UPA 91 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది.
For Latest News and National News click here
Updated Date - Jun 01 , 2024 | 07:41 PM