National: వీడి కక్కుర్తి తగలెయ్య.. రూ.1000 కోసం సన్నీలియోన్‌నే వాడేశాడు..
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:17 PM
ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం ప్రభుత్వం అందించే పథకంలో నటి సన్నీలియోన్ పేరు ఉండటం చూసి షాకయ్యారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. అసలు ఇదెలా జరిగింది ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకొచ్చింది. రూ.1000 ల కోసం కక్కుర్తి పడిన ఓ వ్యక్తి సన్నీలియోన్ పేరును ఎలా వాడుకున్నాడంటే..
ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం ప్రభుత్వం అందించే పథకంలో నటి సన్నీలియోన్ పేరు ఉండటం చూసి కంగుతిన్నారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. పెన్షన్ లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తుండగా సన్నీలియోన్‌కు పెన్షన్ ఏంటా అని షాకయ్యారు. అసలు ఇదెలా జరిగింది ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకొచ్చింది. రూ.1000 ల కోసం కక్కుర్తి పడిన ఓ వ్యక్తి సన్నీలియోన్ పేరును ఎలా వాడుకున్నాడంటే..
ఛత్తీస్‌గఢ్: ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం పెన్షన్ అందించేందుకు మహాతరి వందన్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.1000 అందిస్తోంది. మహిళలకు మాత్రమే అందించే ఈ పథకం కింద ఊహించని వ్యక్తి లబ్ధి పొందుతున్నట్లు కనుగొన్నారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో నటి సన్నీలియోన్ పేరు చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతోనూ ఖాతా ఉన్నట్లు బయటపడింది.
ప్రభుత్వం మహిళలకు మాత్రమే అందించే పథకం ద్వారా తానూ లబ్ది పొందాలనుకున్న ఓ వ్యక్తి తనపేరును నటి సన్నీలియోన్‌గా, భర్త పేరును అమెరికన్ నటుడు జానీ సిన్స్‌గా పేర్కొంటూ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. 10 నెలలుగా మహాతరి వందన్ యోజన స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నాడు.
అధికారుల అవగాహనరాహిత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు బస్తర్ కలెక్టర్ హరీస్ ఎస్. మహిళా,శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బస్తర్‌కు చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీలియోన్ పేరిట పెన్షన్ అందుకుంటున్నట్లు తేలింది. అంగన్‌వాడీ వర్కర్ వేదమతి జోషికి చెందిన పత్రాలు వాడుకుని మహతరీ వందన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా ఫేక్ అకౌంట్‌లో ఉన్న నిధులను తన ఖాతాలోకి మార్చుకుంటున్నాడని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వాన్ని మోసగించినందుకు వీరేంద్ర జోషిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
Updated Date - Dec 23 , 2024 | 07:38 PM