ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farmers Protest: శంభు సరిహద్దుల్లో పతంగులు ఎగరేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా?

ABN, Publish Date - Feb 14 , 2024 | 03:02 PM

శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్‌ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.

న్యూఢిల్లీ: రైతులు చేపట్టిన 'ఢిల్లీ ఛలో' నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు ఢిల్లీలో అడుగుడుగునా భద్రతా ఏర్పాట్లు చేయడం, సెంట్రల్ ఢిల్లీతో హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆంక్షలు విధించడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ భద్రత, కాంక్రీట్ బారికేడ్లను కూడా లెక్కచేయకుండా రైతులు ఛలో మార్చ్‌ కొనసాగిస్తుండటంతో శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు.


పంజాబ్-హర్యానా సరిహద్దుల వద్ద రైతులు పతంగులు ఎగురవేయడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. రైతు నిరిసనకారులు బారికేడ్లు దాటడానికి మంగళవారంనాడు ప్రయత్నించినప్పుడు వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దు ప్రాంతం పంజాబ్‌లోనే ఉన్నప్పటికీ హర్యానా నుంచి డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారంటూ పంజాబ్ ఆధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే శంబు సరిహద్దుల్లో రైతులు పెద్దఎత్తున గుమిగూడటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు పంజాబ్ పరిధిలో ఉన్నందున డ్రోన్లు మోహరించకుండా సంయమనం పాటించాలని అంబాలా డిప్యూటీ కమిషనర్‌కు పాటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్ పార్రే ఒక లేఖ సైతం రాశారు. కాగా, తాము పంజాబ్ ప్రాంతంలోనే ఉన్నప్పటిక మానవ రహిత వాహనంలో గ్యాస్ కేనిస్టర్లను వదులుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పార్రే ధ్రువీకరించారు. సరిహద్దుల వెంట డ్రోన్ల కదలికలను నియంత్రించాలని తాము కోరినట్టు చెప్పారు. ఈ క్రమంలో రైతులు శంభు సరిహద్దుల్లో డ్రోన్లు ఎగురకుండా పంతగులు ఎగురవేస్తున్నారు. అవసరమైతే డ్రోన్లను కిందకు దించేందుకు పట్టుదలగా ఉన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 03:02 PM

Advertising
Advertising