Share News

Ratna Bhandar: పూరీ రత్నభాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు? తెరవడానికి జంకుతున్న అధికారులు!

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:35 PM

ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం(Jagannath's Ratna Bhandar) రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తరువాత ఆ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు.

Ratna Bhandar: పూరీ రత్నభాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు? తెరవడానికి జంకుతున్న అధికారులు!

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం(Jagannath's Ratna Bhandar) రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఆ రహస్య గదిలోని ఖజానాను బయటి ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తరువాత ఆ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విష సర్పాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావించి తెరవడానికి జంకుతున్నారు.

ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిష్ణాతులైన వారిని పిలిపించారు. ప్రమాదవశాత్తు పాము కాటేసినా, వెంటనే వైద్య చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశారు.


అయితే ఇక్కడ ఉన్న సంపద చుట్టూ బర్మీస్ కొండ చిలువలు రక్షణగా ఉంటున్నట్లు స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. పూరీలోని రత్న భాండాగారంలో జగన్నాథుడు, ఇతర దేవతలకు సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలకు పాములు కాపలా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

2018లో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన ఒక బృందం రత్న భండార్‌లోకి ప్రవేశించాలని చూసింది. అయితే పాములు ఉన్నాయన్న వదంతులతో వారు వెనకడుగేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేక్రుష్ణ మహాపాత్ర తెలిపారు.


జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు బలపడ్డాయి. ఈ క్రమంలో రెస్క్యూ సిబ్బందితోపాటు, భువనేశ్వర్ నుంచి ఇద్దరు పాములు పట్టే వారిని సిద్ధం చేశారు. పాములు కరిచినా వెంటనే వైద్య చికిత్స అందించనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 12:35 PM