ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atishi: మోదీని కలిసిన అతిషి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి

ABN, Publish Date - Oct 14 , 2024 | 05:37 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ప్రధానితో అతిషి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) సోమవారంనాడు కలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె ప్రధానిని కలుసుకున్నారు. సమావేశం ఎజెండా ఏమిటనేది మాత్రం వెంటనే తెలియలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ప్రధానితో అతిషి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Supreme court: మోదీపై వ్యాఖ్యలు.. శిశథరూర్‌కు స్వల్ప ఊరట


ప్రధానిని ఢిల్లీ సీఎం కలుసుకున్నట్టు పీఎంఓ ఒక ట్వీట్‌లో ధ్రువీకరించింది. అయితే ఇంతకు మించిన సమాచారం ఏదీ తెలియజేయలేదు. ప్రధానితో సమావేశమైనట్టు 'ఎక్స్' వేదకగా అతిషి తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంబకోణంలో ఐదు నెలల జైలు అనంతరం బెయిలుపై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 05:43 PM