ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Noida: సీబీఐ మాజీ డైరెక్టర్ కన్నుమూత..

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:46 PM

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మృతిచెందారు. విజయ్ శంకర్ కొన్నేళ్లుగా పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సహా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ విజయ్ శంకర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ(మంగళవారం) ఉదయం మృతిచెందారు. విజయ్ శంకర్ కొన్నేళ్లుగా పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సహా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం క్యా్న్సర్ స్టేజ్-4కి చేరుకోగా.. ఇతర సమస్యలు సైతం తీవ్రతరం అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఇటీవల చికిత్స నిమిత్తం గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా అక్కడే చికిత్సపొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సీబీఐ మాజీ డైరెక్టర్ ఇవాళ ఉదయం మృతిచెందారు.


ఈ విషయాన్ని విజయ్ శంకర్ కుటుంబసభ్యులు స్వయంగా వెల్లడించారు. ఆయన చివరి కోరిక మేరకు భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ శంకర్ 1969 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. డిసెంబర్ 2005 నుంచి జులై 2008 వరకూ సీబీఐకి ఆయన నాయకత్వం వహించారు. కాగా, విజయ్ శంకర్ హయాంలో మక్కా మసీదు, మాలేగావ్ పేలుళ్లు, ఆరుషి- హేమరాజ్ జంట హత్యలతో సహా పలు సున్నితమైన కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Aliya Fakhri Arrest: బాలీవుడ్ నటి సోదరి అరెస్టు.. వివరాలు ఇవే..

Tamil Nadu: ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన..

Updated Date - Dec 03 , 2024 | 12:52 PM