ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shock For Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన పలువురు సీనియర్లు..

ABN, Publish Date - Mar 18 , 2024 | 02:49 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ సన్నిహితుడు చింద్వారాకు చెందిన సయ్యద్ జాఫర్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్ ఎస్ వర్మ కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా బోపాల్‌లో సీఎం మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీడీ శర్మ సమక్షంలో బీజేపీలో చేరారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ సన్నిహితుడు చింద్వారాకు చెందిన సయ్యద్ జాఫర్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్ ఎస్ వర్మ కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా బోపాల్‌లో సీఎం మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీడీ శర్మ సమక్షంలో బీజేపీలో చేరారు. చింద్వారాకు చెందిన జాఫర్ కాంగ్రెస్ సీనియర్ నేత, కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. జాఫర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్లు ఎక్స్‌లోని తన ప్రొఫైల్‌లో పెట్టుకున్నారు. అయితే జాఫర్ ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవుల్లో లేరని కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా తెలిపారు.

మాజీ సీఎం కమల్‌నాథ్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వార్తలపై స్పందించిన కమల్‌నాథ్.. తనకు అటువంటి అభిప్రాయం లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని తెలిపారు. తాజాగా కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే జాఫర్ బీజేపీలో చేరడంతో చింద్వారాలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లైంది. జాఫర్‌తోపాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మనీషా దూబే కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు, విధానాలకు ప్రభావితమై బీజేపీలో చేరామని జాఫర్ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిన కొద్దిరోజులకే మరికొందమంది సీనియర్లు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 02:49 PM

Advertising
Advertising