ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

ABN, Publish Date - Jul 01 , 2024 | 04:06 PM

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక మొత్తంగా సభలో రాహుల్ ప్రసంగం హైలెట్స్‌ని చూద్దాం..

  • రాహుల్.. శివుడి(Lord Shiva) ఫొటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుంది. హిందుత్వ పేరు చెప్పి బీజేపీ (BJP) అందరినీ భయపెడుతోంది. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అలాంటి వాళ్లు హిందువులే కాదు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలం. శివుడి మెడలో ఉన్న పాము మరణానికి భయపడకూడదని సూచిస్తుంది. అదే నమ్మకంతో మేం ప్రతిపక్షంలో పోరాడతాం. ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది మన సంకల్పాన్ని బలపరుస్తుంది. సత్యం కోసం పని చేస్తాం.


  • రాజ్యాంగంపై దాడిని ఖండించిన వారిపై ఎన్డీయే సర్కార్ దాడులకు దిగుతోంది. కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తూ కొందరు నాయకులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. పేదలు, దళితులు, మైనారిటీలు, వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు దర్యాప్తు సంస్థలతో నాపై దాడులకు తెగబడ్డారు. ఈడీతో 55 గంటల విచారణ చేశారు.

  • సభలో చాలా మంది అహింస, భయాన్ని అంతం చేయడం గురించి మాట్లాడారు. కానీ, తమను తాము హిందువుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం, అసత్యం గురించి మాత్రమే మాట్లాడతారు. మీరు హిందువులా కాదా?

  • లోక్ సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం. ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగం ముందు తలవంచి జై సంవిధాన్ అనడం ఆనందంగా ఉంది. రాజ్యాంగానికి రక్షణగా ఉంటాం. అధికారం కంటే నిజం గొప్పది.

  • అన్ని మతాల్లో ధైర్యం గురించి ఉంటుంది. హిందూ, ఇస్లాం, సిక్కు ఇలా అన్ని మతాలు ఎన్నో విషయాలను బోధిస్తాయి.

  • అయోధ్య విమానాశ్రయం కోసం భూసేకరణ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కోసం అదానీని పిలిచారు. సామాన్య ప్రజలు మోదీకి గుర్తు రాలేదు. అయోధ్య ప్రజలు ఆయనకు భయపడుతున్నారు. రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సైతం మోదీ ఇదే ధోరణి అవలంబించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం చిరు వ్యాపారుల పొట్టపై కొట్టారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూట‌మి నేత ఘన విజ‌యం సాధించారు. రాముడి జన్మస్థలం బీజేపీకి గుణ‌పాఠం నేర్పింది. అయోధ్యలో(ఫైజాబాద్) పోటీ చేయాలని మోదీ అనుకున్నారు కానీ సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో వారణాసి నుంచి పోటీ చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 01 , 2024 | 04:22 PM

Advertising
Advertising