Gold Rate: పండగల వేళ బంగారం కొనాలంటే ఈ దేశాలకు వెళ్లండి.. వెరీ చీప్..
ABN, Publish Date - Oct 14 , 2024 | 04:17 PM
భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. రకరకాల ఆభరణాలు చేయించుని వేసుకోవాలని ఆశపడుతుంటారు. ముఖ్యంగా పండగలు, శుభకార్యాల వేళ నగలు వేసుకుని అందరికీ చూపించేందుకు ఇష్టపడుతుంటారు. కొంతమంది బంగారం కొనడాన్ని పెట్టుబడి గానూ చూస్తుంటారు. ఎందుకంటే నేటి ధరతో పోలిస్తే మరో ఏడాదికి దాని రేటు మరింత పెరుగుతుంటుంది. అందుకని ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా వడ్డీలకు ఇవ్వడం కంటే కూడా పసిడి కొనేందుకు మక్కువ చూపిస్తారు.
అయితే ఇటీవల కాలంలో బంగారం ధర బాగా పెరిగిపోతోంది. మన దేశంలో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.78,265లు పలుకుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు బంగారం అందని ద్రాక్షగా మారుతోంది. అయితే భారతదేశం కంటే తక్కువ రేటులో బంగారం విదేశాల్లో దొరుకుతోంది. ముఖ్యంగా ఓ ఐదు దేశాల్లో అయితే 10గ్రాముల ధర మన దేశంతో పోలిస్తే ఏకంగా ఐదు నుంచి ఏడు వేల వరకూ తక్కువకే లభిస్తోంది. ఆ దేశాలు, వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా..
ఈ దేశాల్లో పసిడి ధర తక్కువ..
తూర్పు ఆఫ్రికా దేశమైన మలావిలోనూ బంగారం చౌకగా లభిస్తోంది. 10 గ్రాముల బంగారం ధర అక్కడ 1,473,940 మలావియన్ క్వాచాగా ఉంది. దీని విలువ భారతీయ కరెన్సీలో రూ.71,356లకు సమానం. మన దేశంలోని నేటి 10 గ్రాముల గోల్డ్ ధర కంటే రూ.6,900 తక్కువకే పసిడి లభిస్తోంది.
భారతదేశంలో ఇవాళ(అక్టోబర్ 14న) 10 గ్రాముల బంగారం ధర రూ.78,265గా ఉంది. అదే హాంకాంగ్ దేశంలో 10 గ్రాముల పసిడి ధర 665 హాంకాంగ్ డాలర్లుగా ఉంది. మన దేశ కరెన్సీలో 665హాంకాంగ్ డాలర్ల విలువ రూ.72,050లు. అంటే భారత్‌తో పోలిస్తే 10గ్రాములు ఏకంగా రూ.6,200 తక్కువకే లభిస్తోంది.
భారత్‌తో పోలిస్తే కంబోడియా దేశంలోనూ బంగారం తక్కువకే లభిస్తోంది. ఆ దేశంలో 10 గ్రాముల పసిడి ధర 3,48,704 కంబోడియన్ రీల్‌గా ఉంది. భారతీయ కరెన్సీలో ఆ విలువ రూ.72,100లకు సమానం. భారత్‌లో అక్టోబర్ 14న 10గ్రాముల ధర రూ.78,265లు. ప్రస్తుత రేటుతో పోలిస్తే కంబోడియాలో రూ.6165ల తక్కువకే 10 గ్రాములు కొనుగోలు చేయెుచ్చు.
దుబాయ్‌లో 10 గ్రాముల పసిడి ధర భారత కరెన్సీలో నేడు రూ.73,265లుగా ఉంది. మన దేశం రేటుతో పోలిస్తే ఇవాళ రూ.5,000 వరకూ తక్కువ ధరకే బంగారం లభిస్తోంది.
ప్రపంచంలో గోల్డ్ అతి తక్కువకు లభించే దేశాల్లో ఇండోనేసియా ముందు వరసలో ఉంటుందని చెప్పొచ్చు. మన దేశంతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ దేశంలో ఇవాళ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,334,098 ఇండోనేసియా రూపాయలుగా ఉంది. అంటే భారత్ కరెన్సీలో దాని విలువ రూ.72,070లకు సమానం. మన దేశంలో ఇవాళ్టి రేటుతో పోలిస్తే ఇండోనేషియాలో రూ.6,200 తక్కువకే పసిడి లభిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
Bahraich Violence: యూపీలో చెలరేగిన హింస.. ఆసుపత్రి, దుకాణాలు దగ్ధం
Updated Date - Oct 14 , 2024 | 04:17 PM