ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google Maps: ఫ్లై ఓవర్‌ ఎక్కండి!

ABN, Publish Date - Jul 26 , 2024 | 06:16 AM

గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం! దారిలో ఒక ఫ్లై ఓవర్‌ కనిపిస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ఏమో.. నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే.. ఫ్లై ఓవర్‌ ఎక్కాలా? లేక ఫ్లై ఓవర్‌ పక్కగా కింద నుంచి వెళ్లాలా? అర్థం కాదు.

  • గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి..

  • దేశంలోని 40 ప్రముఖ నగరాల్లో ఫ్లై ఓవర్‌ అలర్ట్‌

  • ఫ్లై ఓవర్‌ ఎక్కాలా? వద్దా? అనే సందేహానికి చెక్‌

  • ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల వివరాలూ ఇక ఆ యాప్‌లో!

  • ఇరుకు రోడ్ల గురించి ముందే హెచ్చరించే వ్యవస్థ

  • చెన్నై, కొచ్చి నగరాల్లో మెట్రో బుకింగ్‌లకూ చాన్స్‌

న్యూఢిల్లీ, జూలై 25: గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకొని ఎక్కడికో బయల్దేరాం! దారిలో ఒక ఫ్లై ఓవర్‌ కనిపిస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ఏమో.. నేరుగా వెళ్లాలని చెబుతుంది. నేరుగా అంటే.. ఫ్లై ఓవర్‌ ఎక్కాలా? లేక ఫ్లై ఓవర్‌ పక్కగా కింద నుంచి వెళ్లాలా? అర్థం కాదు. చాలా మందికి ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరిస్తూ గూగుల్‌ మ్యాప్స్‌ భారత్‌లో కొత్త పీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు.. ఇరుగ్గా ఉండే రోడ్లను గురించి ముందే హెచ్చరించే ఫీచర్‌ని, ద్విచక్ర విద్యుత్తు వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడున్నాయో చెప్పే ఫీచర్‌, మెట్రో టికెటింగ్‌.. ఇలా మొత్తం ఆరు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా మ్యాప్స్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకే గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్‌ అలర్ట్‌ సమాచారం ప్రస్తుతానికి మనదేశంలోని 40 నగరాల్లో, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కనిపిస్తుంది. ఐఫోన్‌ వినియోగదారులకు, మిగతా నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది.


ఇక.. దేశంలో విద్యుత్తు వాహనాలు.. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గూగుల్‌ సంస్థ ప్రముఖ ఈవీ చార్జింగ్‌ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఉన్న 8000కు పైగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల వివరాలు గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తాయి. ఆయా స్టేషన్లలో ఏ తరహా చార్జర్లు ఉన్నాయనే విషయాన్ని కూడా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇలా ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల వివరాలు, ఫ్లై ఓవర్‌ అలర్ట్‌, ఇరుకు రోడ్లపై అప్రమత్తం చేసే పరిజ్ఞానం.. గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించే తొలి దేశం మనదే కావడం గమనార్హం. ఇక.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి చాలా ఇరుకైన రోడ్లు ప్రత్యక్షమవుతాయి. వెనక్కి, ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇబ్బందిని తప్పించడానికి గూగుల్‌ సంస్థ ఏఐ సాయంతో అలాంటి ఇరుకు రోడ్ల గురించి ముందే హెచ్చరించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.


హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై కోయంబత్తూరు, ఇండోర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌ నగరాల్లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఈ వారం నుంచే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. యాపిల్‌ ఫోన్‌ వాడేవారికి, మిగతా నగరాల వారికి కూడా త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తామని గూగుల్‌ పేర్కొంది. కొచ్చి, చెన్నై నగరాల్లో వినియోగదారులు మెట్రో రైలు టికెట్లు సైతం గూగుల్‌ మ్యాప్స్‌ నుంచే బుక్‌ చేసుకునేలా ఓఎన్‌డీసీ, నమ్మ యాత్రితో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, మనం వెళ్లేదారిలో ఏదైనా ప్రమాదం జరిగినా, నిర్మాణ పనుల వల్ల ఆ దారి బ్లాక్‌ అయినా.. గూగుల్‌ మ్యాప్స్‌లో ఆ విషయాన్ని సులువుగా రిపోర్ట్‌ చేసే అవకాశాన్ని ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - Jul 26 , 2024 | 06:16 AM

Advertising
Advertising
<