ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamilisai: మందలించ లేదు.. సలహాలు ఇచ్చారు

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:59 AM

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.

  • అమిత్‌ షాతో సంభాషణపై తమిళిసై వివరణ

చెన్నై, జూన్‌ 13: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు. వేదికపై ఆమెతో అమిత్‌ షా మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమెతో ఆగ్రహంగా మాట్లాడారని, మందలించారన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.

దీనిపై ఆమె గురువారం ట్వీట్‌ చేస్తూ ‘‘ఎన్నికల తరువాత తొలిసారిగా ఆ వేదికపైనే అమిత్‌ షాతో మాట్లాడాను. ఎన్నికలు ముగిసినందున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని అడిగారు. నేను వాటిని వివరిస్తుండగా సమయం లేకపోవడంతో త్వరత్వరగా మాట్లాడుతూ పార్టీకి, నియోజకవర్గం అభివృద్ధికి మరింత విస్తృతంగా పనిచేయాలని చెప్పారు. దీనిపై రకరకాల వదంతులు వ్యాపించడంతో ఈ వివరణ ఇస్తున్నాన’’ని వివరించారు.

Updated Date - Jun 14 , 2024 | 04:59 AM

Advertising
Advertising