ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: మహిళ మర్డర్ కేసులో ట్విస్ట్.. హత్యకు గురైన నాలుగు నెలల తర్వాత..

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:15 PM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పనుల నిమిత్తం మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో భూమిని తవ్వాడు. అయితే తవ్వకాల్లో అతనికి ఓ మృతదేహం కనిపించింది.

ఉత్తర్ ప్రదేశ్: కాన్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. తనతో సంబంధం పెట్టుకున్న యువకుడు మరో పెళ్లికి సిద్ధమవడంపై వివాహిత ప్రశ్నించింది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. హత్యకు గురైన నాలుగు నెలల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పనుల నిమిత్తం మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో భూమిని తవ్వాడు. అయితే తవ్వకాల్లో అతనికి ఓ మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు విచారణలో భాగంగా జూన్ 24న ఓ వ్యాపారవేత్త భార్య అదృశ్యం కేసు నమోదు అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన మహిళ వ్యాపారవేత్త భార్యగా గుర్తించారు.


దీంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఆమె హత్యకు గల కారణాలపై ఫోకస్ పెట్టారు. అయితే గత కొన్ని నెలలుగా ఆమె జిమ్ ట్రైనర్ విమల్ సోనీ కనిపించడం లేదని గుర్తించారు. అతని కోసం పలు బృందాలుగా ఏర్పడి పుణె, ఆగ్రా, పంజాబ్‌ గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ నార్త్ డీసీపీ శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడు ఫోన్ ఉపయోగించకపోవడంతో పట్టుకోవడం చాలా కష్టంగా మారిందని డీసీపీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతూ పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చివరికి అరెస్టు చేశామని వెల్లడించారు.


అసలేం జరిగిందంటే..

కాన్పూర్ గ్రీన్ పార్క్ ప్రాంతంలో విమల్ సోనీ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అదే జిమ్‌కి వ్యాపారవేత్త భార్య వచ్చేది. వారి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత యువకుడి వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అయితే ఇదే విషయమై విమల్‌తో మాట్లాడేందుకు జూన్ 24న వివాహిత జిమ్‌కు వచ్చింది. తమ మాటలు ఎవరూ వినొద్దనుకున్న ఇద్దరూ కారు ఎక్కారు. ఆపై మహిళ అతడిని నిలదీసింది. పెళ్లి చేసుకోవద్దని, తనతో ఉండాలని కోరింది. దానికి అతడు ఒప్పుకోలేదు.


మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపానికి గురైన విమల్ సోనీ మహిళ మెడపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. అనంతరం మహిళను విమల్ సోనీ హత్య చేశాడు. అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ అధికారులకు కేటాయించిన మేజిస్ట్రేట్ బంగ్లా ప్రాంతంలో పాతిపెట్టాడు. భార్య కనిపించకపోవడంతో వ్యాపారవేత్త పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కొత్వాలి జిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిమ్ ట్రైనర్ విమల్ సోనీని నిందితుడిగా తేల్చారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

Updated Date - Oct 27 , 2024 | 12:15 PM