Vinesh Phogat: వినేష్ మా అందరికీ చాంపియనే!
ABN, Publish Date - Aug 09 , 2024 | 05:10 AM
పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫొగట్ తమ అందరికీ చాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ పేర్కొన్నారు.
రజత పతక విజేతగానే ఆమెను పరిగణిస్తాం
రివార్డులను అందజేసి ఘనంగా సన్మానిస్తాం
హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీ వెల్లడి
పోరాడి వినేష్ అలసిపోయారు: శశి థరూర్
వినే్‌షను రాజ్యసభకు పంపేవాళ్లం: భూపీందర్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫొగట్ తమ అందరికీ చాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ పేర్కొన్నారు. వినే్‌షను రజత పతక విజేతగానే పరిగణిస్తామని ప్రకటించారు. ఈ మేరకు అన్ని రివార్డులను అందజేసి ఘనంగా సన్మానిస్తామని స్పష్టం చేశారు. ‘‘హరియాణా ధీర వనిత వినేష్ అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ ఫైనల్‌కు చేరింది. కొన్ని కారణాలతో ఆమె ఫైనల్ ఆడలేకపోయింది. అయినప్పటికీ ఆమె మా అందరికీ చాంపియనే. మేమందరం నిన్ను చూసి గర్విస్తున్నాం వినేష్’’ అంటూ సీఎం సైనీ ట్వీట్ చేశారు.
కాగా, వ్యవస్థలతో పోరాడి వినేష్ అలసిపోయారంటూ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నర్మగర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. గత ఏడాది భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను తప్పించాలంటూ వినే్‌ష్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు తీవ్ర స్థాయి ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని దృష్టిలో పెట్టుకుని థరూర్ ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు హరియాణా అసెంబ్లీలో తమకు తగిన బలం ఉంటే వినే్‌షను త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభకు పంపేవాళ్లమని కాంగ్రె్‌సకు చెందిన ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వ్యాఖ్యానించారు.
ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడైన దీపేందర్ హుడా కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. అన్ని పార్టీలు దీనిపైన ఆలోచించాలని సూచించారు. దీపేందర్ రాజీనామాతోనే రాజ్యసభ ఎంపీ సీటు ఖాళీ అయింది. అయితే, వినేష్ పెదనాన్న, మాజీ రెజ్లర్ గీతా ఫొగట్ తండ్రి అయిన మహవీర్ ఫొగట్ మాత్రం భిన్నంగా స్పందించారు. దేశానికి తన కుమార్తె ఎన్నో పతకాలు సాధించిందని.. ఆ సమయంలో రాష్ట్రంలో భూపీందర్ ప్రభుత్వమే ఉందని, ఆమెను కనీసం డీఎస్పీని కూడా చేయలేదని తప్పుబట్టారు. అలాంటివారు వినే్‌షను రాజ్యసభకు పంపాలని కోరడం ఏమిటని ధ్వజమెత్తారు.
Updated Date - Aug 09 , 2024 | 05:10 AM