ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Results: హర్యానాలో బీజేపీ 'హ్యాట్రిక్'

ABN, Publish Date - Oct 08 , 2024 | 08:45 PM

రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే 'ఎగ్జి్ట్ పోల్స్' అంచనాలు తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది.

న్యూఢిల్లీ: రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే 'ఎగ్జి్ట్ పోల్స్' అంచనాలు తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) విజయకేతనం ఎగురవేసింది. 48 సీట్లు గెలుచుకుని వరుసగా 'హ్యాట్రిక్' విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. హర్యానాలో ఒక పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడం కూడా ఇదే మొదటిసారి. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 41 (ఉదయంపూర్‌ ఉప ఎన్నికతో కలిపి) సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా బీజేపీ సరికొత్త రికార్డును సైతం సాధించింది.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ పీఠంపై ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి


పదేళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యారు. అధికారంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ 37 సీట్లతో మ్యాజిక్ మార్క్‌కు దూరంగా ఉండిపోయింది. ఐఎన్ఎల్‌డీ 2 సీట్లకే పరిమితం కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవకుండా చప్పగా చల్లారిపోయింది. ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు.


బీజేపీ శ్రేణుల్లో సంబరాలు

హిందీ హార్ట్‌ల్యాండ్‌గా చెప్పుకునే హర్యానాలో గెలుపు బీజేపీలో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి బలం పెరగడం, త్వరలో జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటం కూడా హర్యానాలో గెలుపు బీజేపీకి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో హర్యానాను నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీ మరోసారి సత్తా చాటుకుంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈసారి పార్టీ బలం పెరిగింది. గతంలో 25 సీట్లు సాధించగా అది ఈసారి 29 సీట్లకు పెరిగింది.


For More National News and Telugu News..

ఇది కూడా చదవండి..

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

Updated Date - Oct 08 , 2024 | 08:49 PM