ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana: దీపావళికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన యజమాని.. ఉబ్బితబ్బిపోతున్న ఉద్యోగులు..

ABN, Publish Date - Oct 16 , 2024 | 08:29 AM

ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.

హర్యానా: ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు. ఉద్యోగులు తమ జీవితంలో ఏ కంపెనీ ఇవ్వని, ఇవ్వలేని సర్‌ప్రైజ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో యజమాని తమపై కురిపించిన ప్రేమను చూసి ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చడీచప్పుడు కాకుండా ఆయన ఇచ్చిన బహుమతులు చూసి నోరెళ్లబెట్టారు. లక్షల ఖరీదు చేసే గిఫ్టులు చూసి ఉబ్బితబ్బిపోతున్నారు.


దీపావళిని మీరేలా చేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని టపాసులు కాల్చుతూ, స్వీట్లు తింటూ కుటుంబంతో హాయిగా గడుపుతారు. కానీ హర్యానాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ వ్యాపారి మాత్రం తన ఉద్యోగులనే కుటుంబంగా భావించారు. ఏకంగా లక్షల విలువ చేసే గిఫ్టులు ఇచ్చి ఉద్యోగులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఎంకే భాటియా అనే వ్యక్తికి హర్యానాలోని పంచకులలో మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. అయితే దీపావళి సందర్భంగా ఆయన 15 మంది ఉద్యోగులకు లక్షల విలువైన ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. సంస్థ కోసం ఏళ్లుగా పని చేస్తూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బంది మెచ్చుకుంటూ ఆయనే స్వయంగా వారికి కార్లను అందించారు. 15మంది ఉద్యోగుల్లో 13మందికి టాటా పంచ్ వాహనాలు ఇవ్వగా, ఇద్దరికి మారుతి గ్రాండ్ విటారా మోడల్‌లను అందించారు. వీటి ప్రారంభ ధర రూ.6లక్షలకు పైగానే ఉంటుంది.


అయితే తమ బాస్ ఇచ్చిన బహుమతులను చూసి ఉద్యోగులంతా ఉబ్బితబ్బిపోయారు. గతంలోనూ పలు కంపెనీల్లో పని చేశామని, కానీ ఇలాంటి సంఘటన జీవితంలో ఎప్పుడూ జరగలేదని బహుమతులు స్వీకరించిన ఎంప్లాయిస్ చెప్తున్నారు. ఇలాంటి బాస్ ఉంటే ఏ కంపెనీలోనైనా ఉద్యోగులు సంతోషంగా, ఉత్సాహంగా పనిచేస్తారని చెప్తున్నారు. ఆయన తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు. ఎంత ఖర్చయినా వారికి ఈ ఏడాది దీపావళికి కార్లు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ యజమాని ఎంకే భాటియా తెలిపారు. తన ఎదుగుదలలో వారూ భాగస్వాములు అని, వారి కష్టాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


అయితే భాటియాకు కార్లు ఇవ్వడం అనేది అలవాటుగా మారిందని రేఖ అనే ఉద్యోగిని తెలిపారు. గతేడాది కూడా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 12మంది ఉద్యోగులకు ఆయన కార్లను బహుమతిగా ఇచ్చారని, అందులో తానూ ఉన్నట్లు ఆమె చెప్పారు. ఏడాదిగా తన కారు పెట్రోల్ ఖర్చునూ కంపెనీయే భరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అంకితభావంతో పని చేసే ఉద్యోగులకు మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థ భవిష్యత్తులోనూ ఇలానే కార్లు అందింస్తుందని సంస్థ యజమాని ఎంకే భాటియా చెప్పడం కొసమెరుపు.

ఈ వార్తలు కూడా చదవండి:

నవంబరు 20న ‘మహా’ ఎన్నికలు!

‘హంటర్‌ కిల్లర్స్‌’ వచ్చేస్తున్నాయ్‌!

Updated Date - Oct 16 , 2024 | 08:55 AM