Heavy rain: తమిళనాడుకు మూడు రోజులు భారీ వర్ష సూచన..
ABN, Publish Date - Aug 11 , 2024 | 11:08 AM
రాష్ట్రానికి ఈ నెల 13వ తేదీ వరకు భారీ వర్ష(Heavy rain) సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవన సీజన్ ప్రాంభంకావడంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. దీనికితోడు వాతావరణంలో మార్పుల కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పాడుతున్నాయి.
చెన్నై: రాష్ట్రానికి ఈ నెల 13వ తేదీ వరకు భారీ వర్ష(Heavy rain) సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవన సీజన్ ప్రాంభంకావడంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. దీనికితోడు వాతావరణంలో మార్పుల కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు కోస్తాతీర ప్రాంతాలు, కుమరి సముద్రతీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఇదికూడా చదవండి: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య..
ఆదివారం కొండ ప్రాంత జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, దిండిగల్, తేని, తెన్‌కాశి, తిరునెల్వేలి, మదురై, కన్నియకుమారి, శివగంగై, రామనాథపురం, తూత్తుక్కుడి, పుదుకోట, తంజావూరు(Thoothukkudi, Pudukota, Thanjavur) జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, సోమవారం కోవై, నెల్లై, నీలగిరి, తిరుపూరు, తేని, దిండిగల్, సేలం, నామక్కల్, కరూర్, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, పుదుక్కోట, కన్నియాకుమారి, మదురై జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, చెన్నైతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
........................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.........................................................................
26న చెన్నైకి పురందేశ్వరి రాక
చెన్నై: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeshwari) ఈ నెల 26న చెన్నైకి రానున్నారు. స్థానిక శ్రీకళాసుధ రజతోత్సవాల ముగింపు ఉత్సవాలకు, కృష్ణాష్టమి వేడుకలకు ఆమె విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయని శ్రీకళాసుధ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు శనివారం పురందేశ్వరిని కారంచేడులో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 11 , 2024 | 11:08 AM