ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: ‘నీలగిరి’ని ముంచెత్తిన వర్షాలు..

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:16 PM

నీలగిరి(Neelagiri) జిల్లాలో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిశాయి. కొండ రైలు మార్గంలో చెట్లు కూలిపడటంతో ఊటీ - కున్నూరు(Ooty - Kunnur) మధ్య రైలు సేవలను రద్దు చేశారు. నీలగిరి జిల్లాలో ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా గత వారం భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి.

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో మళ్ళీ కుండపోతగా వర్షాలు కురిశాయి. కొండ రైలు మార్గంలో చెట్లు కూలిపడటంతో ఊటీ - కున్నూరు(Ooty - Kunnur) మధ్య రైలు సేవలను రద్దు చేశారు. నీలగిరి జిల్లాలో ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా గత వారం భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. గత కొద్ది రోజులుగా జిల్లా అంతటా ఎండలు కాయగా, గురువారం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి మంచుతో కూడిన జల్లులు ప్రారంభమై వర్షం తీవ్రరూపం దాల్చింది.

ఈ వార్తను కూడా చదవండి: Train: స్టేషన్‌లో ఆగకుండా వెళ్లిన రైలు... మళ్లీ వెనకొచ్చింది...


జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా ఊటీ కోతగిరి రహదారిలో మైనైలై ప్రాంతంలో రహదారికి అడ్డంగా ఓ వృక్షం కూలిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఊటీ అగ్నిమాపకదళం హుటాహుటిన వెళ్ళి ఆ చెట్టును తొలగించారు. ఇదే విధంగా కొండరైలు మార్గంలో ఊటీకి చేరువగా ఉన్న కేట్టి రైల్టేస్టేషన్‌(Ketti Railway Station)పై పట్టాలపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. దీనితో ఊటీ - కున్నూరు మధ్య హిల్‌ట్రైన్‌ సేవలు రద్దయ్యాయి.


వర్షాల కారణంగా ఊటీలోని పర్యాటక ప్రాంతాల్లో జనసంచారం బాగా తగ్గింది. ఊటీ బొటానికల్‌ పార్కులో మాత్రం పర్యాటకుల రద్దీ కనిపించింది. జిల్లాలో శుక్రవారం ఉదయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొడనాడులో 22 మి.మీ.లు, ఊటీలో 16.5 మి.మీ.లు, గ్లెన్‌మార్కన్‌లో 16 మి.మీ.లు, కోతగిరిలో 8 మి.మీ.లు, కున్నూరులో 6.7 మి.మీ.లు, ఎమరాల్డ్‌లో 6 మి.మీ.లు, అప్పర్‌భవానీలో 3.మి.మీ.ల వర్షపాతం నమోదైంది.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 12:16 PM