ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farmers Protest: అష్టదిగ్బంధంలో హస్తిన.. సరిహద్దుల్లో బారికేడ్లు, సిటీలో ట్రాఫిక్ డైవర్షన్

ABN, Publish Date - Feb 12 , 2024 | 11:27 AM

తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం దేశ రాజధానిలో నిరసన చేపడుతామని స్పష్టం చేశాయి. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేశారు.

ఢిల్లీ: రైతు సంఘాలు మరోసారి కదం తొక్కాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం దేశ రాజధానిలో భారీ నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేశారు. రైతు సంఘాల నిరసన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రైతు సంఘాల నేతలు, రైతులు ఢిల్లీలోకి (Delhi) రాకుండా అడ్డుకునేందుకు సింఘు, ఘజీపూర్, తిక్రీ సరిహద్దుల వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సరిహద్దులో గల రహదారిపై మేకులను అమర్చామని పోలీసులు తెలిపారు. బారికేడ్లు దాటి రావాలని చూసే వారి వాహనాల టైర్లు పంక్చర్ అవుతాయని స్పష్టం చేశారు.

1500 మంది పోలీసులు

ఢిల్లీలోకి ప్రవేశించే సరిహద్దుల గుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 1000 నుంచి 1500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. బస్టాండ్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, రహదారుల గుండా పోలీసులు విధుల్లో ఉంటారు. పంజాబ్ హర్యానా సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, బల్క్ మేసెజ్ సర్వీసులను నిలిపివేశారు. పంటకు కనీస మద్దతు ధర, గతంలో నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రుల బృందం తొలి విడత జరిపిన చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. సోమవారం (ఈ రోజు) చండీగఢ్‌లో రెండో విడత చర్చలు జరుగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 11:27 AM

Advertising
Advertising