ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం

ABN, Publish Date - Aug 28 , 2024 | 07:50 AM

హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. బీజేపీయేతర పక్షాలకు ఆయుధంగా మలచుకున్నాయి. అందులోభాగంగా రైతుల పట్ల బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉందనేందుకు కంగనా రనౌత్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.

BJP MP Kangana Ranaut

సిమ్లా, ఆగస్ట్ 28: రైతుల నిరసనలపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అలాగే హరియాణాలోని పలు ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఆందోళనలు, ధర్నాలు నిర్వహించింది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ..

మరోవైపు హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. బీజేపీయేతర పక్షాలకు ఆయుధంగా మలచుకున్నాయి. అందులోభాగంగా రైతుల పట్ల బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉందనేందుకు కంగనా రనౌత్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.


స్పందించిన శివసేన (ఉద్దావ్ ఠాక్రే) పార్టీ

మహారాష్ట్రకు చెందిన శివసేన (ఉద్దావ్ ఠాక్రే) పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది సైతం కంగనా వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు చెబుతారని.. అలాగే ఆ అంశంపై బీజేపీ విచారం వ్యక్తం చేస్తుందంటూ ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. కంగనా ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించలేదని.. అలాగే బీజేపీ సైతం విచారం వ్యక్తం చేయలేదని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌‌ పై ఇప్పటి వరకు బీజేపీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రియాంక చతుర్వేది వెల్లడించారు.


కంగన వ్యాఖ్యలపై స్పందించిన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ

ఇంకోవైపు కంగన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయంటూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ స్పందించారు. కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల దేశం యావత్తు నిరసన వ్యక్తం చేస్తుందన్నారు. మరి రైతులు విషయంలో బీజేపీ వైఖరి ఏమిటని ఈ సందర్భంగా మంత్రి హర్షవర్థన్ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేత, ప్రతి పక్షనేత జైరాం ఠాగూర్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు కంగనా రనౌత్ వ్యక్తిగతమన్నారు. అంతేకానీ.. ఆమె వ్యాఖ్యలకు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


అసలు కంగన ఏం మాట్లాడింది..

ఇటీవల కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రైతుల నిరసనల విషయంలో మోదీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకుంటే బంగ్లాదేశ్‌‌లో నెలకొన్న పరిస్థితులు భారత్‌లో సైతం ఏర్పడేవని పేర్కొన్నారు. ఇక ఈ కుట్రలో చైనా, అమెరికా దేశాల ప్రమేయం సైతం ఉందన్నారు. కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన జరిగినప్పుడు మహిళలపై అత్యాచారాలు జరిగాయని.. అలాగే చెట్లకు సైతం శావాలు వేలాడాయన్నారు.


ఇక కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనాయకత్వం సైతం స్పందించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలతో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదంది. పార్టీ తరఫున ఈ అంశాలపై స్పందించే అధికారం ఎంపీ కంగనకు లేదని స్పష్టం చేసింది. కంగన రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించిన విషయం విధితమే.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు..

2020 21 మధ్య రైతుల కోసం కొత్త చట్టాలను తీసుకు వచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేశంలోని యావత్తు రైతులు వ్యతిరేకించారు. ఆ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు చేపట్టారు. ఆ ఆందోళనల్లో హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్న సంగతి అందరికి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 28 , 2024 | 08:35 AM

Advertising
Advertising
<