ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

London : బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో!

ABN, Publish Date - Jul 01 , 2024 | 02:42 AM

ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో ఈసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆలయాల సంరక్షణకు, అకారణ విద్వేషానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటూ స్థానిక హిందూ సంస్థలు ....

  • ఆ దేశంలో 10 లక్షల మందికిపైగా హిందువులు

  • తన నేపథ్యాన్ని గుర్తుచేస్తూ సునాక్‌ ప్రయత్నం

లండన్‌, జూన్‌ 30: ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్‌ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో ఈసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆలయాల సంరక్షణకు, అకారణ విద్వేషానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటూ స్థానిక హిందూ సంస్థలు నిర్దేశించిన అంశాలు ప్రస్తుతం కీలకంగా మారాయి. బ్రిటన్‌లో జూలై 4న గురువారం బ్రిటన్‌లో పోలింగ్‌ జరగనుంది. ఈ దేశంలో పది లక్షల మందిపైగానే హిందువులున్నారు. దీంతో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు వారి ఓట్లే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రచారం సాగించారు. ఆలయాల సందర్శనతో పాటు భారత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు.

ప్రస్తుత ప్రధాని, కన్జర్వేటివ్‌ పార్టీని మరోసారి గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం స్వామి నారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. హిందూ విశ్వాసాలు, విలువలు, సంస్కృతి గొప్పదనాన్ని కొనియాడారు. లేబర్‌ పార్టీ నాయకుడు, సునాక్‌ ప్రధాన ప్రత్యర్థి కీర్‌ స్టార్మర్‌ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని పట్టాలెక్కిస్తానని ప్రకటించారు. ఈయన ‘జై స్వామి నారాయణ్‌’ అని నినదించారు. తమను గెలిపిస్తే సేవే లక్ష్యంగా ముందుకుసాగుతామని.. హిందూ ఫోబియాకు బ్రిటన్‌లో చోటు లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. కాగా, ఎన్నికలకు ముందు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ సునాక్‌ సారథ్యంలోని కన్జర్వేటివ్‌ పార్టీ వెనుకంజలో ఉన్నట్లు స్పష్టమైంది.ఈ నేపథ్యంలో ఎన్నికల్లో హిందువులతో పాటు భారతీయ మూలాలున్న ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారనేది కీలకంగా మారింది.

Updated Date - Jul 01 , 2024 | 02:42 AM

Advertising
Advertising