Politics: ఆ విషయంలో తప్పుచేశాను.. ఉపముఖ్యమంత్రి పశ్చాత్తాపం..!
ABN, Publish Date - Aug 13 , 2024 | 05:56 PM
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.
ముంబై, ఆగష్టు 13: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు. ఆ తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు. మరి అజిత్ పవార్ చేసిన తప్పు ఏంటి? ఆయన ఎందుకు బాధపడుతున్నారు. పూర్తి వివరాలు మీకోసం..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారామతి నియోజకవర్గంలో ఎన్‌సీపీ అభ్యర్థిగా సుప్రియా సూలే పోటీ చేయగా.. ఆమెపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపారు. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య ఘోరపరాజయం పాలైంది. అయితే, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రస్తుతం జన్ సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన తప్పును ఒప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను నిలబెట్టి పెద్ద తప్పు చేశానని అన్నారు. ఇప్పుడు దీనిపై పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు.
‘నా అక్కా చెల్లెల్లను నేను అమితంగా ప్రేమిస్తాను. ఎవరూ తమ ఇంట్లోకి రాజకీయాలను తీసుకురావొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో నా సోదరి సుప్రియా సూలేపై నా భార్య సునేత్రను నిలిపి తప్పు చేశాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. వాస్తవానికి సుప్రియపై సునేత్రను పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది. కానీ, ఇలా చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు భావిస్తున్నాను.’ అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
రక్షాబంధన్ రోజున సుప్రియను కలుస్తారా?
ఆగష్టు 19వ తేదీన రక్షాబంధన్ ఉంది. ఈ పండుగ రోజు సుప్రియా సూలేను కలవడానికి వెళతారా? అని అజిత్ పవార్‌ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను ప్రజా యాత్రలో ఉన్నానని, రక్షా బంధన్ రోజున సుప్రియా, తాను ఒకే చోట ఉంటే తప్పకుండా కలుస్తానని బదులిచ్చారు. శరద్ పవార్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన తమ ఇంటి పెద్ద అని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామని చెప్పుకొచ్చారు.
పార్టీలో, బంధంలో చీలిక..
గత ఏడాది జులై అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య విభేదాలు తలెత్తి.. ఎన్‌సీపీ రెండుగా విడిపోయింది. అజిత్ పవార్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశారు.
త్వరలో ‘మహా’ సంగ్రామం..
అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమ ప్రచార పర్వాన్ని ఉధృతం చేశాయి. అజిత్ పవార్ జన్ సమ్మాన్ యాత్ర పేరుతో ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీలో చీలక తరువాత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సుప్రియా సూలే సైతం యాత్రలతో ప్రజలకు చేరువవుతున్నారు. ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ వంటి కీలక నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Also Read:
హార్దిక్‌తో బ్రేకప్‌కు కారణం ఇదా..?
మస్తాన్ ఫోన్‌లో షాకింగ్ ఫొటోలు, వీడియోలు
బైకును కారులా మార్చేశాడుగా.. వీడియో చూస్తే..
For More National News and Telugu News..
Updated Date - Aug 13 , 2024 | 05:56 PM