మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...

ABN, Publish Date - Apr 21 , 2024 | 08:07 AM

Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్‌లోనూ బ్లాక్‌ బాక్స్‌(Black Boxes) ఏర్పాటు చేయాలని..

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...
Indian Railways

Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్‌లోనూ బ్లాక్‌ బాక్స్‌(Black Boxes) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇండియన్ రైల్వేస్. అవును.. ఒకవేళ ప్రమాదం జరిగితే.. అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు అసలేం జరిగింది? అనే ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు రైళ్లలో క్రూ వాయిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్‌(సీవీవీఆర్ఎస్)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే రైల్ ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.


బ్లాక్ బాక్స్‌‌ను రైళ్లలో పెడితే ఉపయోగం ఏంటి?

ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రైల్వే శాఖ రైళ్లలో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, రైల్ ఇంజిన్‌లో బ్లాక్ బాక్స్ అమర్చడం వలన.. ప్రమాదానికి ముందు జరిగే పొరపాట్లు, రైలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన లోపాలపై ఎప్పటికప్పుడు లోకో పైలట్‌ను అలర్ట్ చేస్తుంది. తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుంది. అయితే, బ్లాక్ బాక్స్ అమర్చే అంశంపై ప్రస్తుతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్వే అధికారులు. త్వరలోనే దీనిని రైళ్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు.

ఇది కూడా చదవండి: నేడు స్థిరంగా గోల్డ్ రేట్లు.. కానీ..


అసలేంటీ బ్లాక్ బాక్స్..

విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ గురించే చర్చ జరుగుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ద్వారా అసలేం జరిగిందో తెలిసిపోతుంది. అందుకే.. ఈ విధానాన్ని రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. బ్లాక్ బాక్స్.. లోకో పైలట్‌ల మాటలు, రైలు కార్యకలాపాల వీడియో, ఆడియో రికార్డ్ చేస్తుంది. రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వేగం, బ్రేక్స్, ఇంజిన్ స్థితి సహా కీలక అంశాలను అబ్జర్వ్ చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ బాక్స్‌లను రైళ్లలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కూతురి కోసం ఎంపీ స్థానాల తాకట్టు!


సీసీ కెమెరాలు కూడా..

బ్లాక్ బాక్స్‌తో పాటు.. రైళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రైల్ ఇంజిన్‌లో 4 డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్‌ కదలికలను ఫోకస్ చేస్తే.. మరొకటి ఇంజిన్ బయట ట్రాక్‌కు ఎదురుగా ఉండి, ట్రాక్‌ను ఫోకస్ చేస్తుంది. నాలుగో కెమెరాను ఇంజిన పైభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇంజిన్‌లలో ఈ బ్లాక్ బాక్స్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని.. త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజిన్లకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 08:23 AM

Advertising
Advertising