ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

INLD: ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ హత్య కేసులో పురోగతి, ఇద్దరు షూటర్ల అరెస్ట్

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:48 AM

ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను గోవాలో పట్టుకున్నారు. సౌరవ్, ఆశిష్‌ను గోవాలో పట్టుకున్నామని, మరికరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

పనాజీ: ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ (Nafe Singh Rathee) హత్య కేసులో పోలీసులు (Police) పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను గోవాలో (Goa) పట్టుకున్నారు. సౌరవ్, ఆశిష్‌ను గోవాలో పట్టుకున్నామని, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నఫే సింగ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ఝాజ్జర్ పోలీసులు ఇదివరకు ప్రకటన చేశారు. ఒక్కరికి రూ.లక్ష చొప్పున ఇస్తామని, ముగ్గురి ఆచూకీ తెలియజేస్తే రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

నఫే సింగ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఆశిష్, నకుల్ సంగ్వాన్ అలియాన్ దీపక్ సంగ్వాన్, అతుల్ అనే ముగ్గురు షూటర్లు కాల్పులు జరిపి, పారిపోయారని వివరించారు. హర్యానాలో గల బదుర్ గఢ్ రైల్వే క్రాసింగ్ వద్ద గత వారం కారులో ఉన్న నఫే సింగ్‌‌పై దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఘటన స్థలంలోనే నఫే సింగ్ చనిపోయారు. నఫే సింగ్ హత్య కేసులో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ పాత్ర ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో.. ఆ అంశంపై పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 11:48 AM

Advertising
Advertising