ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Swati Maliwal: 'ఆప్'కు స్వాతి మలివాల్ రాజీనామా చేస్తారా..?

ABN, Publish Date - May 27 , 2024 | 02:45 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రాజీనామా చేయనని, పార్టీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చెప్పారు. దాడి ఘటన అనంతరం బీజేపీకి చెందిన ఎవరూ తనను కలవలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారనే ఆరోపణలతో సంచలనం సృష్టించిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) సొంత పార్టీకి రాజీనామా చేస్తారా? ఆమె తదుపరి కార్యాచరణ ఏమిటి?. ఈ ప్రశ్నలకు స్వాతి మలివాల్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రాజీనామా చేయనని, అది (పార్టీ) ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదని ఆమె తెలిపారు. దాడి ఘటన అనంతరం బీజేపీకి చెందిన ఎవరూ తనను కలవలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.


''నేను నిజం మాట్లాడకపోతే, నాకూ పార్టీకి మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి కావచ్చు. నన్ను దారుణంగా కొట్టినా దేశంలో అతిపెద్ద ఎన్నికలు జరుగుతుండటం, దీనిని రాజకీయం చేసే అవకాశం ఉందన్న కారణంగా నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చివరకు మరో మార్గం లేకపోయింది. బాధితురాలిని అమానించడం ద్వారా మొత్తం మహిళా ఉద్యమానికే కీడు తలపెట్టారు. నేను పార్టీలోనే ఉన్నాను. ఎందుకంటే పార్టీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదు. పార్టీకి చమటోడ్చి మరీ పనిచేసాను'' అని స్వాతి మలివాల్ తెలిపారు.

Arvind Kejriwal: మరో 7 రోజులు బెయిల్‌ పొడిగించండి


ఆయన ఒక్కరే మాట్లాడారు..

రాజ్యాంగ పదవిలో ఉన్నందున లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మాత్రమే తనతో మాట్లాడారని, ఏమి జరగిందని ఆరా తీయడంతో పాటు పోలీసులతో డీల్ చేసే విషయంలో సమస్యలు ఎదురయ్యాయా అని అడిగారని స్వాతి మలివాల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ తనకు ఇంతవరకూ ఫోన్ చేయలేదని ఆదివారంనాడు మరో ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆయన ప్రమేయం ఇందులో(ఘటనలో) లేదని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఇంతవరకూ తాను పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదని, తమ మధ్య రిలేషన్ యధాతథంగా ఉందని అన్నారు. అయితే ఆయన ఆలోచన ఏమిటో తాను తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ అయితే ఎవరికీ తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు.

Read National News and Latest News here

Updated Date - May 27 , 2024 | 03:00 PM

Advertising
Advertising