ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shocking: వారు అమ్మేది చెప్పులే.. కానీ, ఆ గది నిండా నోట్ల కట్టలే..!

ABN, Publish Date - May 19 , 2024 | 01:53 PM

వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.

Income Tax Raids

లక్నో, మే 19: వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ క్రమంలో వారి వద్ద లెక్కల్లో చూపని భారీగా డబ్బు బయటపడింది. ముగ్గురు చెప్పుల వ్యాపారుల వద్ద ఇప్పటివరకు రూ.40 కోట్ల నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంకా లెక్కించని నగదు ఉందని.. వాటిని కూడా లెక్కించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బు ఒక గది నిండా ఉందన్నారు. రూ.500 బండిళ్లను లెక్కించే బాధ్యతను బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు అప్పగించారు.


‘చాలా నోట్లు ఉన్నాయి, గది మొత్తం 500-500 నోట్ల కట్టలతో నిండిపోయింది. ఇప్పటి వరకు రూ.40 కోట్లు లెక్కతేల్చగా ఇంకా లెక్కలు తేలాల్సిన ఉననాయి. మిగిలిన మొత్తం లెక్కింపు జరుగుతోంది.’ అని అధికారులు తెలిపారు. కాగా, పట్టుబడిన నగదును లెక్కించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ చెప్పుల వ్యాపారులు ఆదాయపు పన్ను చెల్లించడం లేదనే సమాచారం అందుకున్న ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు.. మధ్యహ్నం సమయంలో వారి ఇళ్లపై దాడులు చేశారు. భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.


కాన్పూర్‌లోనూ దాడులు..

అంతకుముందు యూపీలోని కాన్పూర్‌లో ఆదాయపు పన్ను శాఖ భారీ దాడులు నిర్వహించింది. బన్షీధర్ టొబాకో కంపెనీపై శాఖ దాడులు చేసింది. కాన్పూర్‌తో పాటు, ముంబై, ఢిల్లీ, గుజరాత్‌లలో ఉన్న ఈ కంపెనీ బ్రాంచ్‌లలోనూ తనిఖీలు చేసింది. ఏకకాలంలో దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ పొగాకు కంపెనీ తమ టర్నోవర్‌ను దాదాపు రూ.20 నుంచి 25 కోట్లుగా చూపించగా, విచారణలో కంపెనీ టర్నోవర్‌ రూ.100-150 కోట్లుగా తేలింది. 2024 ఫిబ్రవరి 29న ఐటీ రైడ్స్ నిర్వహించింది. ఈ కంపెనీ యజమానికి ఢిల్లీలో ఇంద్రభవనం వంటి ఇల్లు ఉంది. అక్కడ రూ.60 కోట్లకు పైగా విలువైన కార్లతో పాటు.. 16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కూడా స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.

For More National News and Telugu News..

Updated Date - May 19 , 2024 | 01:53 PM

Advertising
Advertising