ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: కర్ణాటక నుంచి లోక్‌సభ‌కు జై శంకర్, నిర్మలా సీతారామన్..?

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:00 PM

కర్ణాటక నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను బరిలోకి దింపాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఈ అంశాన్ని మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు.

బెంగళూర్: సార్వత్రిక ఎన్నికల్లో వరసగా మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాలు రూపొందిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో తన వ్యూహాలకు పదును పెడుతోంది. కొందరు కీలక నేతలను లోక్ సభ (Loksabha) నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. కర్ణాటక (Karnataka) నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను బరిలోకి దింపాలని అనుకుంటోంది. ఈ అంశాన్ని మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) మీడియాకు వివరించారు.

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

కర్ణాటక నుంచి పోటీ..?

విదేశాంగ మంత్రి జై శంకర్‌, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కర్ణాటక నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. జై శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇద్దరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. కర్ణాటకలో పోటీ చేస్తారని.. ఏ నియోజకవర్గమో తెలియదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు.

28 సీట్లు గెలుస్తాం

లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో జేడీఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర స్పష్టం చేశారు. అన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా ఏ సీట్లు బీజేపీకి దక్కుతాయి..? నిర్మలా సీతారామన్, జై శంకర్ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 12:10 PM

Advertising
Advertising