ECI: జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN, Publish Date - Aug 16 , 2024 | 03:58 PM
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir), హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ (ECI) శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
జమ్మూకశ్మీర్ ఎన్నికల షెడ్యూల్..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (2024) షెడ్యూల్ ప్రకారం మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. ఇందుకోసం ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 27వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగస్టు 30వ తేదీతో ముగుస్తుంది. రెండో విడత పోలింగ్ సెప్టెంబర్ 25న జరుగుతుంది. ఇందుకోసం ఆగస్టు 29న నోటిఫికేషన్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 5వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబర్ 9వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మూడవ విడత పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. దీనితో పోలింగ్ ముగుస్తుంది. ఇందుకోసం సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ వెలువడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన జరుగతుంది. 17వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను తొలివిడతలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో 26 అసెంబ్లీ స్థానాలకు, మూడో విడతలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
హర్యానా ఎన్నికల షెడ్యూల్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల (2024) షెడ్యూల్ ప్రకారం, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. ఇందుకు గాను, సెప్టెంబర్ 5న నోటీఫికేషన్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 12వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 13న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అక్టోబర్ 1న పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 16 , 2024 | 04:01 PM