ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elections: మళ్లీ ఎన్నికల కోలహలం.. నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్నికల సంఘం

ABN, Publish Date - Aug 16 , 2024 | 09:09 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలైంది. మళ్లీ దేశంలో ఎన్నికల కోలహాలం మొదలుకాబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

Election Comission

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలైంది. మళ్లీ దేశంలో ఎన్నికల కోలహాలం మొదలుకాబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను మాత్రమే ఈరోజు ప్రకటించవచ్చని.. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన తేదీలను తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మొదటిసారి..

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 9వ తేదీన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తన బృందంతో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. వీలైనంత త్వరగా జమ్మూలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, అక్కడ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది.


10 ఏళ్ల క్రితం..

జమ్మూ కశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో చివరిసారిగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం అధికారుల లెక్కల ప్రకారం ఉత్తర కాశ్మీర్‌లోని జిల్లాల్లో చాలా సవాళ్లు ఉన్నాయి. ఇక్కడ సున్నితమైన ప్రాంతాలు ఎక్కువుగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఉత్తర కాశ్మీర్‌లో అనంత్‌నాగ్, బారాముల్లా, బుద్గాం, బందిపూర్, గందర్‌బల్, కుప్వారా, కుల్గాం, పుల్వామా, షోపియాన్, శ్రీనగర్ జిల్లాలు సున్నితమైన జిల్లాలుగా ఉండగా.. దక్షిణ కాశ్మీర్‌లో కథువా, సాంబా, రియాసి, జమ్ము, ఉధంపూర్ వంటి జిల్లాలు సున్నితమైన ప్రాంతాలుగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 09:51 AM

Advertising
Advertising
<