ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీల కోటలో హోరాహోరీ!

ABN, Publish Date - Nov 06 , 2024 | 04:41 AM

ఈ నెల 13, 20 తేదీల్లో.. రెండు దశల్లో జరగనున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ, మహిళా ఓటర్లే ఫలితాల్ని నిర్ణయించనున్నారు.

  • ఈ నెల 13, 20 తేదీల్లో ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు

  • గెలుపు కోసం తీవ్రంగా తలపడుతున్న జేఎంఎం, బీజేపీ కూటములు

  • ఆదివాసీ ఓటుబ్యాంకుపై సోరేన్‌ గురి

న్యూఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 13, 20 తేదీల్లో.. రెండు దశల్లో జరగనున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ, మహిళా ఓటర్లే ఫలితాల్ని నిర్ణయించనున్నారు. ఝార్ఖండ్‌ జనాభాలో 26.21ు మంది ఆదివాసీలు కాగా రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లలో 28 సీట్లు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఝార్ఖండ్‌లో ఇప్పటి వరకు 13 మంది ముఖ్యమంత్రులు సీఎం పదవిని చేపట్టగా, వారిలో బీజేపీ నేత రఘుబర్‌దాస్‌ తప్ప మిగతా వారందరూ ఆదివాసీలే కావడం విశేషం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాల్లో బీజేపీకి రెండు సీట్లే దక్కగా, జేఎంఎం, కాంగ్రెస్‌ కలిసి 25 సీట్లు గెలుచుకున్నాయి. ఒక స్థానాన్ని బాబులాల్‌ మరాండీ నేతృత్వంలోని జేవీఎం దక్కించుకుంది. అనంతర రాజకీయ పరిణామాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరేన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. ఫలితంగా ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వు అయిన మొత్తం 5 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. మొత్తమ్మీద ఆదివాసీ ప్రాంతాల్లో జేఎంఎం కూటమి, ఆదివాసీయేతర ప్రాంతాల్లో బీజేపీ కూటమి పట్టు పెంచుకున్నట్లు కనపడుతోంది. ఇది ఝార్ఖండ్‌లో ఆదివాసీ, ఆదివాసీయేతర విభజనకు దారితీసిందని భావిస్తున్నారు.


  • ఆదివాసీల మద్దతుతో మరోసారి!

ఝార్ఖండ్‌ రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాకారం చేసిన షిబు సోరెన్‌ వారసుడిగా ఆదివాసీల్లో హేమంత్‌ సోరెన్‌కు గట్టి పట్టుంది. ప్రస్తుత ఎన్నికలను మూలవాసీయులకూ బయటి వారికీ మధ్య పోటీగా హేమంత్‌ సోరెన్‌ అభివర్ణిస్తున్నారు. సీఎంగా తాను చేపట్టిన పలు పథకాలను, తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. విద్యుత్‌ బకాయూల రద్దు, ఉచిత విద్యుత్‌ పంపిణీ, వ్యవసాయ రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రకృతిని ఆరాధించే ఆదివాసీలమైన తాము హిందూ మతంలో భాగం కాదని, తాము ఆచరించే సర్నా మతాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని హేమంత్‌ కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు వ్యక్తిగత చట్టాలు (పర్సనల్‌ లా) ఉన్నట్లుగా ఆదివాసీలకు ప్రత్యేకంగా సర్నా కోడ్‌ను తీసుకురావాలని పేర్కొంటున్నారు. ఆదివాసీలకు కూడా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తమ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాచే ప్రయత్నం బీజేపీ చేస్తోందని హేమంత్‌ సోరేన్‌ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ ఓటుబ్యాంకును మరింత సంఘటితం చేసే ప్రయత్నాల్లో హేమంత్‌ ఉన్నారు. మరోవైపు, తమ కూటమిలోకి ఈసారి సీపీఐ(ఎంఎల్‌)ను కూడా తీసుకొచ్చి కూటమిని మరింత బలోపేతం చేశారు. కూటమిలో జేఎంఎం 42, కాంగ్రెస్‌ 29, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్‌) 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి.


  • ఓట్ల చీలికకు బీజేపీ యత్నాలు

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓటర్లను తన వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ అన్ని రకాలుగా పావులు కదుపుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్న చొరబాటుదారుల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఆదివాసీలకు దక్కాల్సిన ప్రయోజనాలను ముస్లింలు ఎక్కువగా పొందుతున్నారని ఉధృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో ఇప్పటికే నాలుగైదుసార్లు పర్యటించిన ప్రధాని మోదీ.. ఆదివాసీలకోసం రూ.79,150 కోట్ల పథకాన్ని ప్రారంభించారు. కాగా, ఆదివాసీలను తమవైపునకు తిప్పుకొనేందుకు వీలుగా.. ఉమ్మడి పౌరస్మృతి ఆదివాసీలకు వర్తించదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఝార్ఖండ్‌లోని మొత్తం 81 సీట్లకుగాను 32 సీట్లలో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా ఉండటం విశేషం.

Updated Date - Nov 06 , 2024 | 04:41 AM