ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రాహుల్ గాంధీ మన అధినేత.. న్యాయ యాత్రలో పాల్గొనండి: కమల్ నాథ్

ABN, Publish Date - Feb 23 , 2024 | 06:57 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మన నేత, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కోరారు. కమల్ నాథ్ బీజేపీలో చేరతారని ఇటీవల ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamal Nath) కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మన నేత, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కోరారు. కమల్ నాథ్ (Kamal Nath) బీజేపీలో (BJP) చేరతారని ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. కమల దళంలో చేరలేదు. ఇంతలో రాహుల్ గాంధీ తమ నేత అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

PM Modi: రాహుల్‌కు మతి చెడింది..? వారణాసి యువకుల కామెంట్లపై ప్రధాని మోదీ విసుర్లు

మధ్యప్రదేశ్‌లోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశించనుంది. రాహుల్ యాత్ర కోసం కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కమల్ నాథ్ అభిప్రాయ పడ్డారు. రాహుల్ గాంధీ వీధుల్లోకి వచ్చి అన్యాయం, అణచివేత, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. తమ బలం ఏంటో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు చాటాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీకి ధైర్యం ఇవ్వాలని అభిప్రాయ పడ్డారు. మీతో నేను కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దామని కమల్ నాథ్ పిలుపునిచ్చారు

కమల్ నాథ్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. బీజేపీలో చేరతారు, రాజ్యసభ సీటు అంటూ పుకార్లు వినిపించాయి. కానీ కమల్ నాథ్, అతని కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరలేదు. రాహుల్ గాంధీ తమ నేత అని కమల్ నాథ్ అనడంతో ఇక ఆయన పార్టీ వీడరని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 06:57 PM

Advertising
Advertising