ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

First Video: ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్..15 మంది మృతి, 60 మందికి..

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:19 AM

పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.

Kanchanjunga Express

పశ్చిమ బెంగాల్‌(west bengal)లోని రంగపాణి స్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సిలిగురి దాటిన తర్వాత రంగ్‌పనీర్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


సీఎం రియాక్ట్

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి X వేదికగా ఓ పోస్ట్ చేశారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో DM, SP, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్


Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..


Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే


Read Latest National News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 01:18 PM

Advertising
Advertising