ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kangana Ranaut : ఆధార్‌ ఉంటేనే అపాయింట్‌మెంట్‌

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:30 AM

తనను కలవాలంటే ఆధార్‌ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంది.

  • మండీ ప్రజలకు ఎంపీ కంగనా నిబంధన

మండీ, జూలై 12 : తనను కలవాలంటే ఆధార్‌ కార్డుతో రావాలంటూ నియోజకవర్గ ప్రజలకు మండీ ఎండీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌ నిబంధన విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. కంగనా తీరు సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంది. అసలేం జరిగిందంటే.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ నియోజకవర్గం నుంచి ఇటీవల కంగనా భారీ మెజారిటీతో గెలుపొందారు.

తమ ఎంపీని కలవడానికి మండీ నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున ఆమె నివాసానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా వారికి కొన్ని షరతులు విధించారు. ఆధార్‌ కార్డును వెంట తీసుకురావాలని చెప్పడంతోపాటు, ఎందుకు కలవాలనుకుంటున్నారనేది కాగితంపై రాసుకొని రావాలని కూడా సూచించారు.

తనను చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, బయటి ప్రాంతాల వారు వస్తుంటారనీ, వారివల్ల మండీ ప్రజలు అసౌకర్యానికి గురి కాకూడదనే ఈ నిబంధనలు విధించినట్టు కంగనా వివరణ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులు ఇటువంటి మాటలు, నిబంధనలు పెట్టబోరని హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత విక్రమాదిత్య సింగ్‌ విమర్శించారు. ఇటీవల ముగిసిన మండీ లోక్‌సభ ఎన్నికల్లో విక్రమాదిత్యను కంగనా ఓడించి, తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు.

Updated Date - Jul 13 , 2024 | 07:21 AM

Advertising
Advertising
<